
గేల్ మాదిరి విరుచుకుపడే షాట్లు కావు… ధోని మాదిరి బలంగా కొట్టేవి కావు… అయినా బంతులు బౌండరీలు దాటుతూనే ఉన్నాయి. కోహ్లి కొట్టిన కొన్ని షాట్లకు అయితే కామెంటరీ చెప్తున్న వారు సైతం అవాక్కయ్యారు. నిజం… ఇది నిజంగా నిజం… కోహ్లి వంటి బ్యాట్స్ మెన్ ప్రస్తుత తరంలో లేదని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఇంకా చెప్పాలంటే… ప్రపంచం చవిచూసిన అతి కొద్ది మంది గొప్ప బ్యాట్స్ మెన్ల జాబితాలో కోహ్లి పేరు ఖచ్చితంగా ఉంటుందని చెప్పాలి.
విండీస్ బౌలర్లు వేసే స్లో బంతులను అర్ధం చేసుకుని, ఇరగ్గొట్టడం బహుశా కోహ్లికి సాధ్యమైనంతగా మరొకరికి సాధ్యం కాలేదేమో అని చెప్పాలి. 47 బంతులను ఎదుర్కొన్న కోహ్లి 11 ఫోర్లు, 1 సిక్సర్ తో 89 పరుగులతో అజేయంగా నిలిచారు. కోహ్లి చెలరేగడంతో భారత్ 192 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇక టీమిండియాను గెలిపించాల్సిన బాధ్యత బౌలర్ల వంతు..!
Nandamuri Balakrishna has finally confirmed the debut film of his son, Nandamuri Mokshagna. The project…
Pics: Nandamuri Mokshagna’s Debut Announced