అమెరికా తర్వాత ఇండియానే! సిగ్గుపడాల్సిన విషయమా?

స్త్రీలను దేవతలుగా కొలిచే దేశం మన భారతదేశం. అలాంటి దేశంలో స్త్రీలు వ్యవహరిస్తున్న విధానాలు దేశ పరువు ప్రతిష్టతలకు భంగం కలిగిస్తోందన్నది పరిశీలకుల మాట. ‘అభివృద్ధి’ పేరుతో పాశ్చాత్య ధోరణిని అవలంబిస్తూ సొంత సంస్కృతి, సంప్రదాయాలను మంట కలుపుతున్నారని అలనాటి పెద్దలు వ్యక్తపరుస్తున్న ఆవేదనలకు లెక్కే లేదు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ నివేదిక భారతీయ స్త్రీలు ‘స్మోకింగ్’ పట్ల చూపుతున్న మక్కువను బయటపెట్టింది.

ప్రపంచంలో అమెరికా తర్వాత ఇండియాలోనే స్త్రీలు ఎక్కువగా ‘స్మోక్’ చేస్తుంటారని పలు నివేదికలు నిగ్గు తేల్చాయి. ఈ కారణాల వల్లనే ఇటీవల కాలపు యువతలో ప్రెగ్నెన్సీ సమస్యలు తలెత్తడం, కాన్సర్ వంటి ప్రమాదకరమైన జబ్బులు సంక్రమిస్తున్నాయని నివేదికలు తేల్చాయి. ఇండియాలో ‘స్త్రీ’కి ఉన్న ప్రాధాన్యత రీత్యా దేశానికి తలవొంపులు తెచ్చే నివేదికగా పలువురు పేర్కొంటున్నారు.

ADVERTISEMENT

ఆరోగ్యశాఖ నుండి వ్యక్తమవుతున్న సమాచారం మేరకు, “2014-15 సంవత్సరానికి గానూ సిగరెట్ వినియోగం సంఖ్య 93.2 బిలియన్ స్టిక్స్ గా నమోదైంది. 2012-13 ఆర్ధిక సంవత్సరంతో పోల్చుకుంటే, తక్కువగానే నమోదైంది గానీ, ఇదే సమయంలో సిగరెట్ల ఉత్పత్తి కూడా 117 బిలియన్ స్టిక్స్ నుండి 105.3 బిలియన్ స్టిక్స్ కు పడిపోయింది. అయితే సిగరెట్లు వినియోగిస్తున్న మహిళల వినియోగదారుల సంఖ్య దారుణంగా పెరిగిపోయిందని సమాచారం.

1980వ దశకాల్లో 5.3 మిలియన్ గా నమోదైన మహిళల స్మోకింగ్ సంఖ్య 2012వ సంవత్సరానికి 12.7కు చేరుకుంది. 2009-10 నివేదికల ప్రకారం రూరల్ ఏరియాలో 52% మంది మగాళ్లు, 24% మంది మగువలు సిగరెట్లు వినియోగిస్తుండగా, అర్బన్ ఏరియాలలో ఈ శాతం 38 మరియు 12గా నమోదైంది. పట్టణాలలో నివసించే వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో 12 శాతం అయినప్పటికీ మహిళల సంఖ్య పెచ్చుమీరుతోందని హెచ్చరిస్తున్నారు.

Share
Published by

Recent Posts

What To Watch on OTT This Week?

The last few weeks have been rather disappointing for the Indian OTT audience with not…

21 minutes ago

Players Discriminated Against by Selectors? Dhawan Speaks Out

Former India opener Shikhar Dhawan has dismissed claims that players from Jammu and Kashmir face…

51 minutes ago