Telugu

ఐపీఎల్ : బెంగళూరుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన కోల్ కోతా!

ఖచ్చితంగా విజయం సాధిస్తుందనుకున్న మ్యాచ్ లలో సైతం ఓటమి పాలవుతూ అభిమానులను తీవ్రంగా నిరాశపరచడంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు ముందు వరుసలో నిలుస్తోంది. కోల్ కోతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసి 185 పరుగుల భారీ స్కోర్ ను నమోదు చేసింది బెంగుళూరు జట్టు. చివర్లో వాట్సన్, సచిన్ బేబీ, బిన్నీలు చెలరేగి బ్యాటింగ్ చేయడంతో 160 పరుగులు కూడా చేయదనుకున్న జట్టు ఏకంగా 185 పరుగులు సాధించింది. చివరి మూడు ఓవర్లలో దాదాపు 55 పరుగులను రాబట్టి కోల్ కోతాకు గట్టి పోటీ ఇచ్చింది.

లక్ష్య చేధనలో బరిలోకి దిగిన నైట్ రైడర్స్ ను వరుసగా పెవిలియన్ బాటకు పంపుతూ మొదటి 10 ఓవర్లలో కేవలం 69 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు తీసింది. దీంతో బెంగుళూరు జట్టు విజయం దాదాపుగా ఖాయమైంది అనుకున్నారంతా. ఇక్కడే ట్విస్ట్ మొదలైంది… క్రీజ్ లో యూసఫ్ పఠాన్ కు రస్సెల్ తోడవ్వడంతో కోల్ కోతా జట్టు స్కోర్ ఆకాశమే హద్దుగా చెలరేగింది. ఛాలెంజర్స్ బౌలర్స్ కు చుక్కలు చూపిస్తూ సిక్సర్లు బాదడంతో… కెప్టెన్ విరాట్ కోహ్లి అవాక్కయ్యాడు.

ADVERTISEMENT

29 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 60 పరుగులతో జట్టును విజయతీరాలకు చేర్చిన ఘనత పఠాన్ సొంతం చేసుకోగా, 24 బంతుల్లో 1 ఫోరు, 4 సిక్సర్లతో మ్యాచ్ కు ఊపు తెప్పించి, కోల్ కోతా విజయానికి బాటలు వేసిన ఖ్యాతిని రస్సెల్ దక్కించుకున్నాడు. బౌలింగ్ విభాగంలో కూడా అద్భుతంగా రాణించడంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు రస్సెల్ కైవసం చేసుకున్నాడు. ఈ గెలుపుతో కోల్ కోతా 10 పాయింట్లు సాధించి 2వ స్థానంలో నిలువగా, ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించేందుకు బెంగుళూరు ఆశలు అడుగంటుతున్నాయి.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

NBK’s Dada Title Glimpse Builds Curiosity

Nandamuri Balakrishna is starring in an action film directed by Gopichand Malineni. The makers have…

5 minutes ago

BJP’s Rajahmundry Meet: NDA Partner or Future Challenger in AP?

The BJP’s State Executive meeting in Rajahmundry comes at an interesting time in Andhra Pradesh…

7 minutes ago