“జగన్” దృష్టిలో అవేమీ పెద్ద “నేరాలు” కావేమో..!

‘పెద్ద’ గీత పక్కన ‘చిన్న’ గీత గీస్తే… అన్న ఫార్ములా బహుశా అందరికీ తెలిసే ఉంటుంది. బహుశా ఇదే సూత్రాన్ని వైసీపీ అధినేత జగన్ కూడా అవలంభిస్తున్నట్లున్నారు. జగన్ మెడకు చుట్టుకున్న అక్రమాస్తుల కేసుల ముందు ఎయిర్ పోర్టులో మిథున్ రెడ్డి ప్రవర్తన, అసెంబ్లీలో రోజా అసభ్య పదజాలం, గుడివాడలో కొడాలి నాని వీరంగం వంటి కేసులు బహుశా చిన్న చిన్నగా కనపడుతున్నాయోమో!

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత అధికార ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏపీలో ప్రజాస్వామ్యం లేదంటూ.., చంద్రబాబు పతనానికి నాంది ప్రారంభమైందని… ఇలా అతి భారీ డైలాగులు సంధించారు. చెప్పేటందుకే నీతి సూత్రాలు ఉన్నాయని వైసీపీ వర్గాలు మరోసారి నిరూపిస్తున్నారు.

ADVERTISEMENT

అయితే ఎయిర్ పోర్టులో మిథున్ రెడ్డి ప్రవర్తన ఏ విధంగా ఉందన్నది మీడియా వర్గాల ద్వారా రాష్ట్ర ప్రజలందరూ చూసారు. ఒక ఎంపీ అనే అహంకార పూరితమైన ప్రవర్తన మిథున్ లో స్పష్టంగా కనపడిందని విశ్లేషకులు సైతం పెద్ద గొంతుతో వినిపించారు. మరి అలా తప్పుడు ప్రవర్తన చేసిన దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిన తరుణంలో… ఒక పార్టీ అధినేతగా జగన్ వారిని నియంత్రించాల్సింది పోయి, మరింత ప్రోత్సహించే రీతిలో ప్రవర్తించడం పలు విమర్శలకు తావిస్తోంది.

ఒక్క మిథున్ వ్యవహారంలోనే కాదు, ఇటీవల అసెంబ్లీలో రోజా చేసిన అసభ్య పదజాలం వినియోగించినపుడు కూడా ఆమెను వెనుకేసుకొచ్చి ఓ విధంగా తప్పుడు ప్రవర్తనను సమర్థించారు. అలాగే గుడివాడలో కొడాలి నాని అద్దె ఇంటికి సంబంధించిన విషయంలోనూ ఆయన్ని సమర్థించి నవ్వుల పాలయ్యారు. ఇలా పార్టీ నేతనలంతా సక్రమ మార్గంలో నడిపించాల్సింది పోయి, వక్రమ మార్గంలో పయనించేలా ప్రోత్సహించడం రాజకీయ వర్గీయులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు ముందు విశాఖ వేదికగా సబ్బం హరి చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. “జగన్ వస్తే ఏపీలో రౌడీ రాజకీయం ఏర్పడుతుందని, ముఖ్యంగా విశాఖలో వైయస్ విజయమ్మను గెలిపిస్తే… విశాఖను తీసుకువెళ్లి జగన్ చేతిలో పెట్టినట్లే అవుతుందని… దీంతో విశాఖతో పాటు రాష్ట్ర ప్రజలందరూ కాస్త ఆలోచించి ఓటు వేయాలని” కోరారు.

ప్రస్తుత వైసీపీ నేతల ప్రవర్తనలు, ఆ పార్టీ అధినేత విధానాలు చూస్తుంటే… సబ్బంహరి ముందుచూపుతో చేసిన వ్యాఖ్యల సారాంశం ఏమిటో అర్థమవుతోందని విశ్లేషకులు ఆ వ్యాఖ్యలను మననం చేసుకుంటున్నారు. తప్పులు జరగడం, చేయడం మానవ సహజం. వాటిని దిద్దుకుంటూ పోవడం కూడా అంతే సహజం. కానీ, జగన్ తీరు మాత్రం తప్పు మీద తప్పు… తప్పు మీద తప్పు… మాదిరి ఉండడమే విశేషం. ఇలాంటి స్వభావాలు కలిగిన వ్యక్తి నిజంగా రాష్ట ముఖ్యమంత్రి అయితే ఆ రాష్ట్ర పరిస్థితి, రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏం కానూ..! ఊహించుకోవడానికే భయంగా వుంది కదూ!

Share
Published by

Recent Posts

Allari Naresh’s ROM BO: First Weekend

Allari Naresh is back to entertaining audiences with his latest fantasy comedy, Ramba Oorvasi Menaka.…

11 minutes ago

Vijay’s Assembly Statement: A Timeline With Political Fire

Some political timelines are just numbers. This one carries a lot more weight. Tamil Nadu…

23 minutes ago