Telugu

అమరావతిని మొత్తానికి తప్పిస్తారా?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో మూడు రాజధానుల గురించి ప్రకటించిన నాటి నుండీ ఆ విషయంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ముఖ్యమంత్రి మనసులో మాటని రిపోర్టుగా తయారు చేసారో ఏమో గానీ జీఎన్ రావు కమిటి కూడా అదే చెప్పింది. ఈ ప్రతిపాదనపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ADVERTISEMENT

ఇలా ఉండగా అమరావతికి భూములు ఇచ్చిన రైతులు రోడ్ల మీదకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. అయితే జగన్ కు ఇండైరెక్టుగా మద్దతు ఇస్తూ చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు అమరావతిని మొత్తానికి పక్కకు తప్పించే ప్రయత్నం చేస్తున్నందుకు జగన్ ని అభినందించడం విశేషం.

“రాజధాని విషయంలో జగన్ గారు ఒక ప్రణాళిక కనుగుణంగా ముందుకు పోతున్నట్లు అనిపిస్తున్నది. శాసనసభ రాజధానిగా తాయిలం చూపి ముందు పరిపాలన రాజధాని ని విశాఖకు మార్చటం. ఆపైన అమరావతిలో అసెంబ్లీ సమావేశాలు ముందు కుదించటం క్రమంగా అమరావతి చాప్టర్ ముగించటం సులభం. దీర్ఘకాలంలో విశాఖ రాజధాని. హైకోర్టు కర్నూల్,” అంటూ చెప్పుకొచ్చారు.

ఆయన చెప్పినట్టుగానే ముందు అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్ అని చెప్పినా, జీఎన్ రావు కమిటి కేవలం అసెంబ్లీ వర్షా కాల సమావేశాలు మాత్రమే అమరావతిలో జరపాలని చెప్పడం విశేషం. ఐవైఆర్ కృష్ణారావుకు జగన్ ప్రభుత్వం నుండి ఖచ్చితమైన సమాచారం రావడంతోనే ఇటువంటి వ్యాఖ్యలు చేసారా అనే అనుమానాలు పలువురు వ్యక్తపరుస్తున్నారు.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

అయ్యో పేర్నీ.. జగన్‌కి ప్రాణ భయమని చెప్పేస్తే ఎలా?

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఆయన సోదరి షర్మిలకు మధ్య ఆస్తి వివాదాలు అందరికీ తెలిసిందే. అయితే ఆ వివాదాలు…

7 minutes ago

HBD Prabhas: Big Star, Bigger Aura!

Prabhas is undoubtedly one of the biggest superstars in Indian cinema. Since the release of…

33 minutes ago