అభిమానులకు “జై బాలయ్య” టాట్టూ ఆఫర్!

పబ్లిసిటీ విషయంలో 14 రీల్స్ సంస్థ అనుసరించే విధానం ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంది. అంతలా తాము నిర్మించే సినిమాలకు వినూత్న పబ్లిసిటీని ప్లాన్ చేస్తుంటారు. తాజాగా నాని హీరోగా నిర్మించిన “కృష్ణగాడి వీరప్రేమగాధ” సినిమా పబ్లిసిటీ కూడా మరింత వినూత్నంగా చేస్తున్నారు. సినిమా విడుదల సమయం దగ్గరవుతున్న కొద్ది అభిమానులను ఉత్సాహపరిచే సరికొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు.

ఈ సినిమాలో హీరో నాని నందమూరి బాలకృష్ణ అభిమానిగా నటించనున్న విషయం తెలిసిందే. నాని చేతి మీద “జై బాలయ్య” అన్న టాట్టూ కూడా ఉంటుంది. మరి ఇదే టాట్టూలు కావాలంటే సంప్రదించండి అంటూ చిత్ర నిర్మాతలలో ఒకరైన అనిల్ సుంకర ఒక ఫోన్ నెంబర్ ను ట్వీట్ చేసారు. ఒకరికి ఒక టాట్టూ మాత్రమే ఇస్తామని ప్రకటించారు కూడా! మరో 24 గంటల్లో సినిమా మొదటి షో పడనుండడంతో… ప్రస్తుతం “జై బాలయ్య” టాట్టూల ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

ADVERTISEMENT

నిజానికి ఈ సినిమాకు తొలుత “జై బాలయ్య” అన్న టైటిల్ ను ఖరారు చేసారు. అయితే అది చివరికి “కృష్ణగాడి వీరప్రేమగాధ”గా రూపాంతరం చెందింది. అనంతపురం, హిందూపురంలలో దాదాపు ప్రతి 10 మందిలో 9 మంది బాలకృష్ణ గారి అభిమానులేనని, అక్కడ పుట్టిన కధే ఇదని, అందుకే ఈ సినిమాలో బాలయ్యకు వీరాభిమానిగా తానూ కనిపిస్తానని నాని చెప్పుకొచ్చారు. చూడబోతుంటే నందమూరి నట సింహం బాలయ్య అభిమానులు మొదటి రోజు మొదటి షో చూసే విధంగా “జై బాలయ్య” పబ్లిసిటీ ఊపందుకుంటోంది.

Share
Published by

Recent Posts

అయ్యో పాపం చెవిరెడ్డి… పులివర్తి సుధా రెడ్డి ర్యాగింగ్!

నేడు తిరుపతి జిల్లా చంద్రగిరిలో అనూహ్య సంఘటన జరిగింది. పరిషత్ ఎన్నికల్లో దాదాగిరి చేద్దామని వచ్చిన మాజీ మంత్రి చెవిరెడ్డి…

24 minutes ago

Sudha Reddy, Chevireddy Face Off Amid Chandragiri Polls

The exchange between Pulivarthi Sudha Reddy and former MLA Chevireddy Bhaskar Reddy during the parishad…

43 minutes ago