
గోదావరి జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడుతుండడం, రైతులు కూడా వ్యవసాయ పనుల్లో పూర్తిగా నిమగ్నమై ఉండడంతోనే ఆయన పర్యటన తాత్కాలికంగా వాయిదా పడిందని వారు అంటున్నారు. పవన్ పర్యటనలో వర్షాలు కారణంగా జన సైనికులు, రైతులు, ఆడపడుచులు ఇబ్బంది పడకూడదన్న ఉద్ధేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు
వాయిదా పడినంత మాత్రాన పార్టీ కేడర్ నిరాశ చెందవద్దని, తదుపరి తేదీల కోసం సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలు సూచిస్తున్నారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ కు కంటి ఆపరేషన్ జరిగింది. దాని వల్ల ఏమైనా ఇబ్బంది కలిగి యాత్రను వాయిదా వేశారా అని అనుమానం కూడా పలువురిలో ఉంది.
Satya and director Ritesh Rana have formed a highly entertaining combination with Mathu Vadalara films.…
The current year is still underway, but Bollywood producers have already begun locking release dates…