
ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కేంద్రంలోని అధికార బీజేపీపై ఉందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన గురుతర బాధ్యతను బీజేపీ విస్మరిస్తోందని, ఏపీకి అన్ని విధాలుగా న్యాయం చేస్తామని హామీ ఇస్తేనే గడచిన ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమికి అనుకూలంగా తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రచారం చేశారని ఈ సందర్భంగా కార్యకర్తలు చెప్పుకొచ్చారు.
ఇప్పటికైనా రాష్ట్రానికి చెందిన ఎంపీలు పార్టీల జెండాలు పక్కనబెట్టి ప్రత్యేక హోదా కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ వాసులు చేసిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని అయినా, ఎంపీలు పోరాడాలని పేర్కొన్నారు. అయితే ‘జనసేన’ అధినేతగా పవన్ ఎలాంటి ఆదేశాలు జారీ చేయకపోయినా… పార్టీ జెండాలు పట్టుకుని యువతరం మాత్రం నిరసన ప్రదర్శనలకు దిగుతోంది.
Is Bollywood's biggest battle shifting from the box office to social media? Recent reports suggest…
రిలీజ్ కి రెడీ అవ్వాల్సిన ఓ ప్యాన్ ఇండియా సినిమా, ఇప్పటికే ఆ సినిమా కోసం కోట్ల రూపాయలు ఖర్చు…