Telugu

జూనియర్… “దానవీరశూరకర్ణ” మాటేంటి..?

“మహానటి” ఆడియో వేదికగా జూనియర్ ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ‘ఎన్టీఆర్ గారి పాత్రలో అతిధి రోల్ చేయాలని స్వప్న తన దగ్గరకు వచ్చిందని, ఆయన వేషం వేసే అర్హత తనకు లేదని, తాత గారి పాత్రలో నటించడం ఈ జన్మలో జరిగే పని కాదని, అంత దమ్ము తనకు లేదని’ తేల్చిచెప్పారు. మరో పక్కన ఎన్టీఆర్ బయోపిక్ లో బాలకృష్ణ నటిస్తున్న దరిమిలా తారక్ అన్న ఈ వ్యాఖ్యలు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

ADVERTISEMENT

అయితే గతంలో ఇదే తారక్ “దానవీరశూరకర్ణ” రీమేక్ చేయాలన్న ఆశ తనలో ఉందని, ఇప్పుడు కాకపోయినా ఎప్పుడోకప్పుడు ఖచ్చితంగా ఆ సినిమాను రీమేక్ చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంకా లోతుగా చెప్పాలంటే… ‘దానవీరశూరకర్ణ’ రీమేక్ కోసం దర్శక ధీరుడు రాజమౌళి మరియు ‘విక్టరీ వీరుడు’ వివి వినాయక్ లను సంప్రదించినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. ఇందులో ఎంత వాస్తవమున్నా… ‘దానవీరశూరకర్ణ’ రీమేక్ అయితే స్వయంగా తారక్ వెల్లడించిందే.

బహుశా ఈ వ్యాఖ్యలు తర్వాత ఏర్పడిన పరిణామాల నేపధ్యంలో… తన అభిప్రాయాన్ని మార్చుకున్నారో ఏమో గానీ, ‘మహానటి’ వేదికపై మాత్రం తాత గారి పాత్రను పోషించడం ఈ జన్మకు జరిగే పని కాదని స్పష్టం చేసారు. ఎన్టీఆర్ బయోపిక్ లో బాలయ్య నటించడంతో, ఇక్కడ మళ్ళీ తాను ఎన్టీఆర్ లా కనిపించడం అనేక వివాదాలకు దారి తీస్తుందన్న ముందు జాగ్రత్తతోనే తారక్ సున్నితంగా తిరస్కరించి ఉండవచ్చన్న టాక్ కూడా ట్రేడ్ వర్గాలలో బలంగా వినపడుతోంది. అంటే ‘దానవీరశూరకర్ణ’ పర్మినెంట్ గా అటకెక్కినట్లేనా..?!

Share
Akhil

Akhil, a passionate young writer, started his journey at M9 News and has since become a key member of the team. With a deep love for Telugu cinema, Hyderabad city news, and a keen interest in general affairs, Akhil br…

Published by

Recent Posts

Sandeep Reddy Vanga Loved Romanchakam: Pranay Reddy Vanga

The upcoming Telugu film Romanchakam promises to combine youthful emotions with comedy, romance and suspense.…

1 minute ago

టాక్సిక్ పోతే.. రాకాపై ఎందుకీ పంచాయితీ?

టాక్సిక్ ఫెయిల్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో కొందరి దృష్టి రాకా మీద పడింది. విడుదలయ్యాక ఈ సినిమాకూ అదే…

19 minutes ago