
కానీ తొలిసారిగా ఈ చిత్ర షూటింగ్ విశేషాలు వెబ్ ప్రపంచంలో హల్చల్ చేస్తున్నాయి. అయితే ఇక్కడే ఓ మెలిక కూడా ఉందండోయ్..! అది ఏ తెలుగో, ఇంగ్లీషో అయితే అందరికీ అర్ధమైపోతుందని దర్శకుడు సుకుమార్ అనూహ్యమైన ‘ట్విస్ట్’ ఇచ్చారు. దాదాపు రెండు నెలల పాటు లండన్ లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా, ఈ నెల 11వ తేదీతో స్పెయిన్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. స్పెయిన్ లో షూటింగ్ సందర్భంగా స్థానిక మీడియా ప్రతినిధి ‘నాన్నకు ప్రేమతో…’ షూటింగ్ ను సుకుమార్ అనుమతితో కవర్ చేసారు.
జూనియర్ ఎన్టీఆర్, రకుల్ ప్రీత్ సింగ్ లతో సహా చిత్ర యూనిట్ సభ్యులు సినిమా గురించి పలు విశేషాలు ఇంగ్లీష్ లో చెప్పగా, సదరు మీడియా సంస్థ దానిని స్పెయిన్ భాషలోకి తర్జమా చేసుకుని ప్రసారం చేసింది. దానికి సంబంధించిన 3 నిముషాల వీడియో ప్రస్తుతం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఊపేస్తోంది. స్పెయిన్ మీడియా కవర్ చేయడమంటే సాధారణ విషయం కాదని, ఎన్టీఆర్ సత్తాకు నిదర్శనమని ‘బుడ్డోడు’ అభిమానులు సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలు.
చిత్ర విశేషాలు చెబుతూనే అర్ధం కాకుండా ఇచ్చిన ‘ట్విస్ట్’ అదిరిపోయింది కదూ! మరి సుక్కూ అంటే అదే మరి! అంటున్నారు సినీ జనాలు. అంతా అవగతం కావాలంటే ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోయే జనవరి 13వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే.
Kamal Haasan continues to explore different roles and work with new directors. The actor has…
Matthu Vadalara fame Athulya Chandra and actor Bibin have been arrested in Kerala for allegedly…