
బహుశా ఈ అంశాన్ని పరిశీలించారో ఏమో గానీ… ‘యంగ్ టైగర్’ జూనియర్ ఎన్టీఆర్ తన “నాన్నకు ప్రేమతో” సినిమా కావడానికి ఉన్న దారులను సుగమం చేసుకుంటున్నారు. తన సినీ కెరీర్ 15 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇప్పటివరకు సహకరించిన మీడియాకు దస్పల్లలో గ్రాండ్ పార్టీ ఇచ్చారు. అయితే పేరుకు 15 ఏళ్ళు అయినప్పటికీ ప్రధాన ఉద్దేశం “నాన్నకు ప్రేమతో” సినిమాకు ఆశించినంత పబ్లిసిటీ ఇవ్వడం మరియు సినిమా విడుదల తర్వాత పాజిటివ్ గా ప్రమోట్ చేయడం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదేమో!
బాబాయ్ “డిక్టేటర్” సినిమాతో పోటీ రీత్యా మరియు ఇటీవల ఏర్పడిన పరిణామాల రీత్యా “నాన్నకు ప్రేమతో” విజయం ‘బుడ్డోడు’కు చాలా ప్రతిష్టాత్మకమైనది. దీంతో ఎలాగైనా విజయం సాధించాలనే నేపధ్యంలోనే ఈ పార్టీని ఎరేంజ్ చేసినట్లుగా సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇప్పటికే సినిమాపై భారీ నుండి అతి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. వీటిని రీచ్ కావాలంటే “నాన్నకు ప్రేమతో” ఓ రేంజ్ లో ఉండాల్సిందే.
సరిగ్గా ఇక్కడే మీడియా ప్రాముఖ్యత సినిమాకు అవసరమవుతుంది. ఓ మోస్తరు సినిమాను కూడా మీడియా అండ ఉంటే ‘బ్లాక్ బస్టర్’ చేసుకోవచ్చని గతంలో పలు అగ్ర హీరోల సినిమాలు నిరూపించాయి. అందుకే ‘బుడ్డోడు’ ముందుగా మీడియాను బుట్టలో వేసుకునే ప్రయత్నం చేసాడు అని ఫిలింనగర్ వర్గాల టాక్. మరి ‘యంగ్ టైగర్’ ఆశించిన ఫలితాన్ని అందుకుంటాడా? ఈ నెల 13వ తేదీతో తేలిపోవచ్చు!
కేసీఆర్ త్వరలోనే తన ఫామ్ హౌస్ అజ్ఞాతానికి శుభం కార్డు వెయ్యనున్నట్టుగా స్వయంగా ఆయనే ప్రకటించారు. ఆదివారం జరిగిన బిఆర్ఎస్…
Telangana Assembly sessions are rarely short of political drama, but today’s developments have taken the…