
అలాగే వారిద్దరూ కోలుకున్నారు. అయితే ఆ తరువాత కూడా వారు పబ్లిక్ లో కనిపించలేదు. కరోనా కారణంగా షూటింగ్లు నిలిచిపోవడంతో ఇద్దరు ఇంటికే పరిమితం అయిపోయారు. పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో రాజకీయంగా కూడా పెద్ద యాక్టీవ్ గా లేరు. ఆయన తిరుపతి ఉపఎన్నికల షాక్ నుండి ఇంకా కోలుకున్నట్టు లేరు.
అయితే చాలా కాలం క్రితం అభిమానులకు కనిపించిన హీరోలు ఈ రోజు సోషల్ మీడియా లో దర్శనం ఇచ్చారు. వారికి సంబంధించిన తాజా ఫోటోలు సోమికల్ మీడియాలో దర్శనం ఇచ్చాయి. పవన్ కళ్యాణ్ కుమారుడు అఖీరా తో కలిసి ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. పవన్ తో పాటు అకీరా ఫోటోలు కూడా రావడంతో ఫ్యాన్స్ మరింత ఖుష్ అయ్యారు.
ఇక ఎన్టీఆర్… ట్రెడిషనల్ లుక్ లో ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. ఎన్టీఆర్ ఫోటోలలో ఎప్పటిలానే తేజస్సుతో మెరిసిపోతున్నాడని అభిమానులు మురిసిపోతున్నారు. అయితే కొందరు మాత్రం ఈ ఫోటోలు పాతవి అని కూడా అంటున్నారు. ఏది అయితేనేం మెజారిటీ అవి కొత్త ఫోటోలు అనే ఆనందపడుతున్నారు. ఆ రకంగా ఎన్టీఆర్, పవన్ అభిమానులు ఈరోజు ఖుష్ అయ్యారు.
Prakriti Pavani turns up the festive voltage in this striking red lehenga set that blends…
Advance bookings for Bollywood's magnum opus Ramayana were set to open today (October 20) at…