
ఈ సినిమాకు కీలకమైన సన్నివేశాలు రామోజీ ఫిలిం సిటీలో షూట్ చేస్తున్నారు. అల్లూరి సీతారాజు గా రామ్ చరణ్ బ్రిటిష్ జడ్జీల ముందు తన వాదనలు వినిపిస్తున్న సీన్లు తీస్తున్నారు. ఇది ఇలా ఉండగా కొత్త సంవత్సరం సందర్భంగా సినిమా ప్రమోషన్స్ మొదలు పెడతారని వార్తలు వస్తున్నాయి.
జనవరి ఒకటిన సినిమా టైటిల్ ప్రకటిస్తారట. రఘుపతి రాఘవ రాజారాం, రామ రౌద్ర రుషితం అనే పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సహజంగా రాజమౌళీ ఇటువంటి రూమర్లను కాదని కొత్త వి ప్రకటిస్తూ ఉంటారు. చూడాలి ఏం జరగబోతుంది అనేది.
ఆర్ఆర్ఆర్ వచ్చే ఏడాది జులై 30న విడుదల చేస్తామని చివరిగా నిర్మాతలు ప్రకటించారు. అయితే వచ్చే ఏడాది దసరాకు గానీ ఆ పై ఏడాది సంక్రాంతికి గానీ సినిమా వాయిదా పడొచ్చని వార్తలు వస్తున్నాయి. మొన్న ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో రామ్ చరణ్ ఈ వార్తలను ఖండించారు. అనుకున్న ప్రకారమే సినిమా షూటింగ్ జరుగుతుందన్నారు.
YS Jagan Mohan Reddy seems to have found his biggest election issue even before the…
అవును. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ మాట చెప్పారు. నేడు తెలంగాణ భవన్లో పార్టీ నేతలతో మాట్లాడుతూ,…