
ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల బిజినెస్ పూర్తి అయ్యింది. దాదాపుగా 210 కోట్ల మేర జరిగింది. ఇది ఇలా ఉండగా ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ రైట్స్ డీల్ కూడా అయిపోయిందని అంటున్నారు. స్టార్ నెట్ వర్క్ 220 కోట్లకు దక్కించుకుందని సమాచారం. స్టార్ నెట్ వర్క్ అంటే సినిమా హాట్ స్టార్ లో విడుదల అవుతుంది.
ఇతర భాషలలో సినిమా హైప్ ఎలా ఉండబోతుందో చూడాలి. బాలీవుడ్ నటులు… అజయ్ దేవగన్, అలియా భట్ నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అజయ్ దేవగన్ షూటింగ్ మొదలు పెట్టగా.. అలియా ఇంకా షూటింగ్ లోకి ఎంటర్ కావాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు మరియు ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.
వారి వారి పోరాటాలకు ముందు వారు ఢిల్లీలో కలిసినప్పుడు ఏం జరిగి ఉంటుంది అనే ఊహాజనిత స్టోరీ… ఆర్ఆర్ఆర్. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఎన్టీఆర్ సరసన ఒక హాలీవుడ్ తార కనిపించబోతుంది. సినిమా ప్రమోషన్స్ ఎప్పుడెప్పుడు మొదలు పెడతారా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Gautam Gambhir and the Indian team management faced questions after their decision to send Tilak…
Prabhas might be one of the biggest superstars in Indian cinema, but there have been…