
అయితే ఆ వంశాలకు చెందిన ఇద్దరు హీరోలను … రామ్ చరణ్, ఎన్టీఆర్ ల ను తీసుకుని వచ్చి రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. మామూలుగానే మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అనుకునే అభిమానులను ఒక తాటి మీదకు తేవడం అయ్యే పనేనా?
సినిమాకు సంబంధించిన మెటీరియల్ బయటకు వస్తున్న కొద్దీ… ఎవరు గొప్ప అనేది వస్తుంది. కొందరు ఇప్పటివరకు రామ్ చరణ్ మాత్రమే హైలైట్ అయ్యాడు అంటుండగా మరి కొందరు రాజమౌళి తారక్ ల మధ్య సాన్నిహిత్యాన్ని బట్టి జక్కన్న ఎన్టీఆర్ ని తక్కువ చేసే అవకాశం లేదని అంటున్నారు.
అయితే ఇప్పటి అభిప్రాయాలకు ఆయుషు తక్కువ ఉంటుంది. ట్రైలర్ విడుదల అయ్యే నాటికి పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. అయితే ఈలోగా రామ్ చరణ్ పీఆర్ బృందం రంగంలోకి దిగి తమ హీరోను గట్టిగా ప్రమోట్ చేస్తున్నారు. నేషనల్ మీడియాలో సైతం ఆర్ఆర్ఆర్ అనేది రామ్ చరణ్ చిత్రమే అన్న స్థాయిలో ప్రమోషన్లు ఉన్నాయి.
ఎవరి హీరోలను ఆయా పీఆర్ బృందాలు ప్రమోట్ చెయ్యడం తప్పేమీ కాదు… ఇప్పటి కాలాన్ని బట్టి అది అవసరం కూడా. పైగా పాన్ – ఇండియా స్థాయిలో నిరూపించుకోవడానికి ఎన్టీఆర్ కు గానీ అటు రామ్ చరణ్ కు గానీ ఇంతకంటే అవకాశం దొరకదు. అయితే ఇక్కడ వచ్చిన చిక్కల్లా ఈ ప్రచారంలో ఎన్టీఆర్ వెనుకబడిపోతున్నాడు. ఇప్పటికైనా మేలుకోకపోతే నష్టపోతాడు అని అభిమానుల ఆందోళన.
New data is showing that H-1B petitions from Indian companies in the US have dropped…
Amyaela is setting the internet ablaze with a breathtaking new photoshoot that totally redefines modern…