Telugu

ఎన్టీఆర్ కాదంటే విజయ్ దేవరకొండ దగ్గరకు వెళ్ళిందా?

యంగ్ హీరో విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ తో ఒక పెద్ద ప్లాప్ మూటగట్టుకున్నాడు. రీసెంట్ గా ఇస్మార్ట్ శంకర్ తో ఫామ్ లోకి వచ్చిన పూరి జగన్నాథ్ ఓ స్క్రిప్టుని వినిపించి ఓకే చేయించుకున్నాడని సమాచారం. టిపికల్ మాస్ ఎంటర్టైనర్ గా ఈసినిమా రూపొందబోతోంది. ఈ సినిమాకు ఫైటర్ అనే పేరు ఖరారు చేసినట్టు సమాచారం. ఈ టైటిల్ ను తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ కూడా చేశారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నత్తి సమస్యతో ఉన్న కుర్రాడిగా కనిపించబోతున్నట్లు చెప్తున్నారు.

ఈ స్క్రిప్ట్ తొలుత ఎన్టీఆర్ కు వినిపించాడట పూరి. అయితే ఎన్టీఆర్ దానిని చెయ్యడానికి పెద్దగా ఇంట్రస్టు చూపించలేదంట. జై లవకుశ సినిమాలో ఎన్టీఆర్ ..నత్తితో బాధపడే వ్యక్తిగా కనిపించారు. ఇలాంటి పాత్రలతో తమలో ఉన్న నటన ను మరింతగా బయిటపెట్టడానికి వీలుంటుందని ఎన్టీఆర్ చేసిన ఆ సాహసాన్ని అందరూ మెచ్చుకున్నారు. అయితే అటువంటి పాత్రతో ఇంకో సినిమా చేస్తే వర్క్ అవుట్ అవ్వదేమో అని ఎన్టీఆర్ భయపడి నో చెప్పాడట.

ADVERTISEMENT

విజయ్ కు ప్రస్తుతం క్రాంతి మాధవ్ తో ఒక సినిమా ఉంది. అలాగే హీరో అనే బైలింగ్వల్ సినిమా ఉంది. ఈ రెండు సినిమాలు పూర్తి చేసి వచ్చే ఏడాది జనవరిలో ఫ్రెష్ గా పూరి సినిమాలు మొదలు పెట్టబోతున్నాడట విజయ్. వరుస పరాజయాలతో సతమతం అవుతున్న ఈ యువ హీరో ఈ సినిమా మీద భారీ ఆశలే పెట్టుకున్నాడు. పూరి కూడా చాలా కాలం తరువాత వచ్చిన సక్సెస్ ని ఈ సినిమాతో కూడా కొనసాగించాలని పట్టుదలగా ఉన్నాడు. చూడాలి ఏం జరగబోతుందో!

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

Hyd’s Water Crisis Turns Into a Congress vs BRS Battle

Water is a basic necessity. Yet in Telangana, even drinking water has become a political…

3 minutes ago

BB Telugu: Dakshi & Shalini Out Of Game

Bigg Boss Telugu Season 10 continues to keep viewers hooked with high drama. As the…

34 minutes ago