
బాలీవుడ్ లో ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ సర్జికల్ స్ట్రిక్స్ నేపథ్యంలో తీసిన ఉరి… ఇప్పుడు కబీర్ సింగ్ దానిని అధిగమించే అవకాశం ఉంది. ‘కబీర్ సింగ్’ పాత్రలో షాహిద్ కపూర్ నటన ఆయన కెరీర్లోనే బెస్ట్ అని కొనియాడుతున్నారు. కియారా అద్వానీ తన అందచందాలతో కట్టిపడేసిందంటున్నారు. కాకపోతే నటనలో ఇంకాస్త మెరుగుపడాలని అంటున్నారు. మొత్తం మీద ‘కబీర్ సింగ్’ బాలీవుడ్ బాక్సాఫీసును షేక్ చేస్తోంది. తెలుగు దర్శకుడు సందీప్ ను అక్కడి నిర్మాతలు ఆఫర్స్ తో ముంచెత్తున్నారట. ఈ మధ్య కాలంలో రాజమౌళి తరువాత బాలీవుడ్ మీద ప్రభావం చూపిన తెలుగు డైరెక్టర్ సందీప్.
దేశమంతటా 3123 స్క్రీన్లలో విడుదలైన ఈ చిత్రం సింగిల్ స్క్రీన్లతోపాటు మల్టీప్లెక్స్‌ల్లోనూ దూసుకుపోతుంది. అర్జున్ రెడ్డి సినిమాకు హిందీ రీమేక్‌గా వచ్చిన కబీర్ సింగ్‌కు ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద క్రేజ్ తగ్గడంలేదు. కలెక్షన్ల జోరును చూస్తుంటే.. అలవోకగా ఈ సినిమా ఇంకో వారం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. మరోవైపు తమిళ్ లో ఆదిత్య వర్మగా తీసిన ఈ సినిమా విడుదలకు సిద్ధం అవుతుంది. కన్నడ రిమేక్ కి కూడా సన్నాహాలు చేస్తున్నారు.
Bigg Boss Telugu Season 10 continues to keep viewers hooked with high drama. As the…
ఒకప్పుడు రాజకీయ పార్టీలు, వాటి అధినేతలు, నేతలు ప్రజాసేవ చేయడం కొరకే రాజకీయాలలోకి వచ్చామని చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు అలాంటి…