
‘సర్ధార్ గబ్బర్ సింగ్’ను పొగుడుతూ వర్మ చేసిన ఓ ట్వీట్ కు స్పందించిన కమల్ ఖాన్ మాటలు చివరికి వర్మ – కమల్ ల మధ్య బెట్టింగ్ కు కారణమయ్యాయి. ‘బాహుబలి’ మొదటి రోజున ప్రసాద్ ఐమాక్స్ ధియేటర్ వద్ద దాదాపు 1.5 కిలోమీటర్ల ‘క్యూ’ ఉందని, ఇపుడు ‘సర్ధార్ గబ్బర్ సింగ్’కు ఎంత లైన్ ఉంటుందో చూడాలి అంటూ వర్మ చేసిన ట్వీట్ కు ‘0 కిలోమీటర్లు’ అంటూ నవ్వుతూ కమల్ ఖాన్ బదులిచ్చారు.
పవన్ ను ఎవరితో పోల్చవద్దని, పవన్ కంటే హిందీలో కట్టప్ప పెద్ద స్టార్ అని, రాజ్ పాల్ యాదవ్ లాగా కనపడే పవన్ సినిమాకు ఉచిత టికెట్ + రవాణా చార్జీలు + కూల్ డ్రింక్ + పాప్ కార్న్ ఇచ్చినా గానీ హిందీ ప్రేక్షకులు పవన్ సినిమాకు వెళ్ళరని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే పవన్ కళ్యాణ్ అత్యంత క్రేజీ నటుడు, ఇది కమల్ ఖాన్ అర్ధం చేసుకోవాలని వర్మ చేసిన ట్వీట్ కు హిందీలో పవన్ కంటే ఆయుష్మాన్ పెద్ద స్టార్ అని కౌంటర్ ఇచ్చారు.
“10 మంది కంటే ఎక్కువ ప్రేక్షకులు పవన్ కళ్యాణ్ సినిమాకు వచ్చారని సమాచారం అందితే, తను రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలలో ‘న్యూడ్’గా పరిగెడతానని” కమల్ చేసిన ట్వీట్ కు ‘అయితే సిద్ధంగా ఉండు… పవన్ గురించి నీకేమి తెలియదు… బాంబే వెల్వెట్ సినిమా విషయంలో నీ అభిప్రాయం సరై ఉండవచ్చు, కానీ ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ విషయంలో మాత్రం నీది తప్పు అవుతుంది అంటూ వర్మ కౌంటర్ ఇచ్చారు.
పవన్ అభిమానుల సంగతి పక్కన పెట్టు, ఒక్కసారి పవన్ ను ముంబై వచ్చి తనకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడమను… అప్పుడు ఏం జరుగుతుందో చూసుకుందాం… ఇది నా అడ్డా బాస్… అసలు పవన్ కళ్యాణ్ అన్న పేరు బాలీవుడ్ లో ప్రచారం అయ్యింది అంటే అది ఒక్క నా ట్వీట్స్ వలనే అని, లేకపోతే అసలు పవన్ అన్న పేరే ఎక్కడా వినపడేది కాదని, దేశంలోనే నెంబర్ 1 విమర్శకుడిగా పవన్ ను పాపులర్ చేసిన ఘనత తనకు దక్కుతుందని, లేదంటే మహా ఫ్లాప్ హీరో రాజ్ కుమార్ యాదవ్ కూడా పవన్ ను మించిన స్టార్ కమల్ చేసిన ట్వీట్లపై పవర్ స్టార్ అభిమానులు మండిపడుతున్నారు.
Kamakshi Bhaskarla is an emerging actress in Tollywood who is trying to establish herself as…
Nandamuri Balakrishna is starring in an action film directed by Gopichand Malineni. The makers have…