
ఈ సినిమా మొదటగా హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో రాసుకున్నాడట పూరి. అయితే ఇప్పుడు పాన్ – ఇండియా సినిమాగా చేస్తుండడంతో దానిని ముంబై బ్యాక్ డ్రాప్ గా మార్చేసారట. దీనితో సినిమా 80% ముంబై లో చెయ్యబోతున్నారట. దీనితో ముంబై ఆఫీస్ ఓపెన్ చేశాడట పూరి. ఆయనకు కరణ్ జోహార్ బృందం అన్ని విధాలుగా సహాయపడుతుందట.
మార్షల్ ఆర్ట్స్ బ్యాక్డ్రాప్లో సాగనున్న ఈ కథలో విజయ్ కొత్త లుక్లో కనిపిస్తారట. దీనికి సంబంధించిన శిక్షణ కూడా మొదలుపెట్టారు. జనవరిలో చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో విజయ్ అమ్మ పాత్రలో రమ్యకృష్ణ కనిపించబోతుందట. ప్రస్తుతం విజయ్ తాన వరల్డ్ ఫేమస్ లవర్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఆ చిత్రం చివరి షెడ్యూల్ జరుగుతుంది.
ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాతో పాటు తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో హీరో సినిమాలో నటిస్తున్నాడు విజయ్. ఆ సినిమా కూడా మొన్న ఆ మధ్య హీరో సినిమాను కూడా ఏవో స్క్రిప్ట్ సమస్యలు అని మధ్యలో ఆపేశాడు. ఆ సినిమా షూటింగ్ మళ్ళీ మొదలు అవుతుందని వార్తలు వచ్చినా అది జరగలేదు.
Today, on Prabhas birthday, social media is flooded with wishes from celebrities, film personalities, and…
BOTTOM LINE Short on Scares RATING 2/5 Story, Screenplay, Director: Kirtan Nadagouda Cast: Chaithra J.…