
తాజాగా మోసాక్ ఫోనెస్కా నుంచి బహిర్గతమైన పత్రాల్లో పీ-విజన్, ఓడ్బురేట్ పేర్లు ఉన్నాయి. పీ-విజన్ లో 15 శాతం వాటా ఓడ్బురేట్ కొనుగోలు చేయగా, వీడియోకాన్ కు 25 శాతం, సైఫ్ అలీ కాన్ కు 9 శాతం, కరీనా, కరిష్మాలకు చెరో నాలుగున్నర శాతం, పంచశీల గ్రూప్ కు 33 శాతం వాటాలున్నాయి. అప్పట్లో జట్టును దక్కించుకోవడంలో విఫలమైన పీ-విజన్ కు పెట్టుబడులు పెట్టిన ఓడ్బురేట్ వెనుక ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ ఉండవచ్చని తెలుస్తోంది.
అక్టోబరు 2009లో ప్రారంభమైన ఓడ్బురేట్, మార్చి 4, 2010న ఐపీఎల్ బిడ్డింగ్ పేపర్లపై సంతకాలు చేసిందని, జట్టు దక్కకపోవడంతో, ఆ వెంటనే మూత పడిందని మోసాక్ ఫోన్సెకా పత్రాల్లో ఉంది. ఇదే విషయమై వీడియోకాన్ ఎండీ వేణుగోపాల్ ధూత్ ను ప్రశ్నించగా, పీ-విజన్ లో 25 శాతం వాటా గురించి మాత్రమే తనకు తెలుసునని, ఇతర సభ్యులు, వాటాదారుల వివరాలు తెలియవని చెప్పడం గమనార్హం. ఇక ఈ ఓడ్బురేట్ వెనుక ఉన్నదెవరు, అక్రమంగా పెట్టుబడులు పెట్టి ఐపీఎల్ టీమ్ ను దక్కించుకోవాలని ప్రయత్నించింది ఎవరన్నది అధికారికంగా తేలాల్సి వుంది. మొత్తానికి పనామా చేస్తున్నవి కేవలం ఆరోపణలు కాదు, పక్కా డాక్యుమెంట్లతో సహా చూపిస్తోందని అర్ధమవుతోంది.
Pics: Nandamuri Mokshagna’s Debut Announced
The results of the 2026 Telugu Film Producers Council elections are out, with the C…