Telugu

ఐశ్వర్యరాయ్, కత్రినా కైఫ్ మాటలతో సల్మాన్ కు షాక్!

సల్మాన్ ఖాతాలో మాజీ ప్రేయసిలుగా ఐశ్వర్యరాయ్, కత్రినా కైఫ్ ల స్థానం చిరస్థాయిగా ఉంటుంది. ఈ ఇద్దరూ కూడా సల్మాన్ తో పెళ్లి వరకు వెళ్లిన వారు కావడంతో ఐశ్వర్య, కత్రీనాల వ్యాఖ్యలకు ఎప్పుడూ ప్రాధాన్యత ఉంటుంది. తాజాగా వీరిద్దరూ అవాక్కయ్యే ప్రకటనలు చేసారు. సల్మాన్ ను ఎప్పుడూ వెనకేసుకొచ్చే కత్రీనా కైఫ్ ఎటకారాన్ని ప్రదర్శించగా, సల్మాన్ అంటే మండిపడే ఐశ్వర్య ప్రశంసలు కురిపించడం విశేషం. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే… ఈ ఇద్దరి స్పందన కూడా ఒకే అంశంపై!

ADVERTISEMENT

త్వరలో ప్రారంభం కానున్న ‘రియో ఒలంపిక్స్ ఇండియ‌న్ టీమ్‌’కు ‘గుడ్‌విల్ అంబాసిడ‌ర్‌’గా స‌ల్మాన్ ఖాన్‌ను నియ‌మించిన తర్వాత… స‌ల్మాన్‌ కు ఆ అర్హ‌త లేదంటూ వివాదం చెల‌రేగింది. బాలీవుడ్, రాజకీయ వర్గాలు రెండుగా చీలిపోయి, ప‌లువురు సల్మాన్ పై విమ‌ర్శ‌లు చేయగా, మ‌రికొంద‌రు మ‌ద్ద‌తుగా పలికారు. ఈ తరుణంలో మాజీ ప్రేయసి కత్రినా కైఫ్ నుంచి ఎటువంటి స్పంద‌న వ‌స్తుందనే ఉత్సాహంతో పలకరించిన మీడియాకు “సల్మాన్‌ వివాదంలో చిక్కుకోవడంలో కొత్తేం ఉంది?” కత్రీనా కైఫ్ అవాక్కయ్యే సమాధానం ఇచ్చింది.

ఇక, ఐశ్వ‌ర్య‌రాయ్ మాత్రం స‌ల్మాన్‌ఖాన్‌ కు పూర్తి మద్దతుగా నిలిచింది. స్పోర్ట్స్‌, మ్యూజిక్ వంటి అంశాల‌పై అంబాసిడ‌ర్‌గా ఉంటానంటూ ముందుకొచ్చిన వారిని అభినందిచాల‌ని, అలాగే మంచి చేస్తోన్న స‌ల్మాన్ లాంటి వారిని ప్రోత్స‌హించాల‌ని పిలుపునిచ్చి, బాలీవుడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.

Share
Saumya

Saumya is a passionate Telugu movie addict and an avid binge watcher of OTT platforms, covering Travel, Bollywood, Tamil, Kannada, Malayalam, and international cinema. With a decade of experience at M9 News, Saumya br…

Published by

Recent Posts

Antha Ramuloru Choosukuntaru Glimpse Draws Attention

Sangeeth Shoban and Anaswara Rajan’s upcoming youthful entertainer has finally revealed its title as Antha…

11 minutes ago

Bethlehem Kudumba Unit: Mallu Blockbuster, Telugu Flop?

Malayalam film Bethlehem Kudumba Unit starring Nivin Pauly and Mamitha Baiju in the lead roles…

1 hour ago