
ఇది ఇలా ఉండగా దాదాపు 151 టీఎంసీల గోదావరి జలాలను ఒడిసిపట్టేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. దాదాపు 18 లక్షల ఎకరాలకు కొత్తగా నీరు అందించడం మరో 18 లక్షల ఆయకట్టును స్థిరీకరిస్తుంది ఈ ప్రాజెక్టు. ప్రపంచంలోనే అతి పెద్దదైన లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం. కేసీఆర్ నాయకత్వంలో పూర్తయిన అతిపెద్ద ప్రాజెక్టు ఇదే. కాగా ఇటీవలే సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిధిలోని పలు పంపుహౌస్‌లు, బ్యారేజీ పనులను స్వయంగా పర్యవేక్షించారు.
సహజంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలంటే దశాబ్దాలు పట్టే దేశంలో రెండు మూడేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా పలు బ్యారేజీలు, అత్యంత క్లిష్టమైన ఎత్తిపోతల నిర్మాణాలు, విద్యుత్ సబ్ స్టేషన్లను పూర్తిచేస్తుండడంతో ప్రపంచం తెలంగాణ వైపు చూస్తోందని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే కేసీఆర్ పట్టుదల, అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు అకుంఠిత దీక్షతో ఈ ప్రాజెక్టు ఇంత తొందరగా పూర్తి అయ్యింది.
Andhra Pradesh is bracing for a potentially severe cyclone as the weather system over the…
Nikhil Siddhartha has shared an update on his upcoming pan-India adventure, Swayambhu, confirming that the…