
ఇందుకు ఒకేరోజులో ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉదాహరణలు ఇచ్చారు. నిన్న అధికారులతో ఒక సమీక్షా సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ…. వెంటనే వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న 50,000 పోస్టులను ఉన్నఫళంగా భర్తీ చెయ్యాలని ఆదేశించారు.
ఈటల రాజేందర్ ఖాళీ చేసిన హుజురాబాద్ లో వచ్చే ఉపఎన్నిక కోసం ఈ నిర్ణయమని తెలియంది ఎవరు? మరోపక్క వైఎస్ జయంతి కారణంగా కడప జిల్లా పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా అదే పంథా ఎంచుకున్నారు.
రాష్ట్రంలో జీతాలు ఇవ్వడానికే ఇబ్బంది పడుతుంది ప్రభుత్వం అయితే ముఖ్యమంత్రి మాత్రం తొందరలో ఉపఎన్నిక జరిగే బద్వేల్ కు 500 కోట్ల అభివృద్ధి పనులు ప్రకటించారు. కొన్నిటికి శంకుస్థాపనలు కూడా చేసి వచ్చారు. బద్వాల్ వైఎస్సార్ కాంగ్రెస్ వెంకటసుబ్బయ్య అకాలమరణం కారణంగా ఉపఎన్నిక అనివార్యం అయ్యింది.
ఆయన సతీమణికి టిక్కెట్ ఇవ్వనున్నట్టు జగన్ కొన్ని సంకేతాలు ఇచ్చారు. మరోవైపు హుజురాబాద్ లో ఈటలకు ధీటైన అభ్యర్థి కోసం తెరాస ఎదురుచూస్తుంది.
After a couple of postponements, Venkatesh’s Aadarsha Kutumbam is finally set to release on October…
Divine action seems to be slowly becoming a trend in Tollywood. These days, even when…