Telugu

చంద్రబాబుతో డీల్ చేసినంత ఈజీ కాదు కేసీఆర్ తో వ్యవహారమంటే

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆప్తుడు, రాష్ట్రంలోనే అత్యంత ప్రముఖుడు గా ఉన్న జూపల్లె రామేశ్వరరావు కు చెందిన మైహోం గ్రూప్ సంస్థలపై ఆదాయపన్ను శాఖ దాడులు చేయడం సంచలనంగానే ఉంది.మై హోం గ్రూపునకు చెందిన అన్ని కార్యాలయాలు, నివాసాల్లో ఐటి దాడులు జరగటం ఆసక్తికర పరిణామంగా మారింది. గత కొంత కాలంగా మై హోం గ్రూప్ మీడియాలో భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతోంది.ఈ తరుణంలో ఐటి రంగంలోకి దిగటం ఆసక్తికర పరిణామంగా మారింది.

గత ఐదు సంవత్సరాలుగా కేసీఆర్ కేంద్రంతో మంచి సంబంధాలు నెరిపారు. 2019 ఎన్నికల తరువాత మెజారిటీకి దగ్గరలో ఆగిపోతే కేసీఆర్ అవసరం పడుతుందని భావించి తెరాస పట్ల బీజేపీ కూడా ఉదాసీనతగానే ఉంది. చంద్రబాబుతో పోల్చి సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్ లో కేసీఆర్ ని పొగిడారు. అయితే ఎన్నికల తరువాత సీన్ ఒక్కసారిగా మారిపోయింది. బీజేపీకి సొంతంగా మెజారిటీ వచ్చింది అదే సమయంలో ఆ పార్టీ తెలంగాణలో నాలుగు సీట్లు గెల్చుకుంది.

ADVERTISEMENT

దీనితో తెలంగాణాలో 2024 ఎన్నికల సమయానికి అవకాశం కనిపించడంతో బీజేపీ వైఖరిలో స్పష్టమైన మార్పులు వచ్చాయి. గతంలో చంద్రబాబును వేధించినట్టుగానే కేసీఆర్ మీద కూడా అదే మంత్రం ప్రయోగిస్తున్నట్టుగా ఉంది. ఇందులో భాగం గానే జూపల్లె రామేశ్వరరావు కు చెందిన మైహోం గ్రూప్ సంస్థలపై ఆదాయపన్ను శాఖ దాడులు చేయడం. దీనితో కేసీఆర్ కు ఇబ్బందులు మొదలయినట్టే అనుకోవాలి. అయితే చంద్రబాబుతో డీల్ చేసినంత ఈజీ కాదు కేసీఆర్ తో వ్యవహారమంటే అంటున్నారు తెరాస నేతలు.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

BB Telugu: Dakshi & Shalini Out Of Game

Bigg Boss Telugu Season 10 continues to keep viewers hooked with high drama. As the…

30 minutes ago

వైఎస్, లోకేష్, పవన్ మారారు.. జగన్‌ మారలేరా?

ఒకప్పుడు రాజకీయ పార్టీలు, వాటి అధినేతలు, నేతలు ప్రజాసేవ చేయడం కొరకే రాజకీయాలలోకి వచ్చామని చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు అలాంటి…

40 minutes ago