‘హీరో’ అవకాశం వచ్చింది, అయితే ‘నేనే’ వద్దన్నా!

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, కేటీఆర్ కుమారుడు అయిన హిమాన్షురావు ఒక షార్ట్ ఫిలిం ద్వారా హీరో అవతారం దాల్చబోతున్నారని ఇటీవల వార్తలు హల్చల్ చేసిన విషయం తెలిసిందే. యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఏడుగురు చిన్నారులు హీరోలుగా తెరకెక్కుతున్న షార్ట్ ఫిల్మ్ లో హిమాన్షు కూడా ఒకరని ఈ వార్తల సారాంశం. అయితే తాజాగా దీనిపై ఓ దినపత్రికకు హిమాన్షు సమాచారం అందించారు.

ADVERTISEMENT

“తనకు హీరోగా అవకాశం అయితే వచ్చింది కానీ, అందులో తానూ నటించడం లేదని, ప్రస్తుతం తన దృష్టంతా చదువులు, పరీక్షలపైనే ఉందని” స్పష్టం చేసాడు. దీంతో కేసీఆర్ మనవడు హీరో అన్న వార్తలకు ‘ది ఎండ్’ కార్డ్ పడినట్లయ్యింది. అయితే ఇదే సమయంలో హిమాన్షు తండ్రి కేటీఆర్ తన హెయిర్ స్టైల్ మార్చి పాత సినిమాలలో హీరోల మాదిరి కనపడుతున్నారని కామెంట్లు వస్తున్నాయి.

Share
Published by

Recent Posts

BB10: Who Is Strong & Who Gets Sympathy?

The tenth edition of the Bigg Boss Telugu TV show is live. Nagarjuna Akkineni returned…

26 minutes ago

Varanasi AP/TG Business: Too Massive a Deal for Mahesh?

Mahesh Babu’s Varanasi, directed by SS Rajamouli, is already one of the biggest films in…

4 hours ago