
ఇప్పుడు తాజగా ఆమె ఒక బాలీవుడ్ సినిమాని వదిలేసుకుంది అనే వార్త సంచలనం సృష్టిస్తుంది. వివరాల్లోకి వెళ్తే… బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవ్గణ్ హీరోగా నటిస్తోన్న ‘మైదాన్’ సినిమాలో హీరోయిన్గా చేసే అవకాశం వచ్చింది. 1952 నేపథ్యంలో ప్రముఖ ఫుట్బాల్ ఆటగాడు సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఇందులో ఆమె అబ్దుల్ రహీమ్ భార్యగా కనిపిస్తుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ మొదలైంది. కొద్ది భాగం షూట్ చేసిన తర్వాత తనకు మరీ ఆంటీలా చూపిస్తున్నారని అలిగిందట ఈ అమ్మడు. పైగా తన పాత్రకు సరైన ప్రాధాన్యత కూడా లేదు అంటూ ఆమె సినిమా నుండి తప్పుకుందని సమాచారం.
అందులోనూ కీర్తి నటిస్తున్న తొలి హిందీ సినిమా ఇదే. ఆరంభంలోనే ఇలాంటి సమస్యలు ఎదురైతే మున్ముందు కెరీర్ దెబ్బతినే అవకాశం ఉందని కీర్తి ఈ నిర్ణయానికి వచ్చారట. ఆమె స్థానంలో ప్రియమణిని తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. మరోవైపు కీర్తి సురేష్.. రజినీకాంత్ కొత్త చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది.
Gautam Gambhir and the Indian team management faced questions after their decision to send Tilak…
Prabhas might be one of the biggest superstars in Indian cinema, but there have been…