Telugu

కేజీఎఫ్ 2 ముందు కేజీఎఫ్ చాలా చిన్నదట

కథలో కంటెంట్.. హీరోయిజంలో సత్తా ఉందని నిరూపించింది ఇటీవలే విడుదలైన ‘కేజీఎఫ్’ మూవీ. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్స్‌ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. విడుదలైన అన్ని భాషలలోనూ సినిమా సక్సెస్ అయ్యింది. ఈ క్రమంలో సినిమా రెండో భాగం కూడా రూపొందిస్తున్నారు.

ADVERTISEMENT

కేజీఎఫ్ 2 షూటింగ్ శరవేగంగా సాగుతుంది. దాదాపుగా 80% పూర్తి అయ్యిందని అంటున్నారు. వచ్చే ఏడాది మార్చ్ లో అన్ని భాషలలో ఒకేసారి విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో సినిమా హీరో యష్ ఒక ఇంటర్వ్యూలో చేసిన ఒక కామెంట్ సినిమాపై హైప్ ను మరింత పెంచేసేవిలా ఉన్నాయి.

“ఒకసారి కేజీఎఫ్ 2 తెర మీద చూశాకా కేజీఎఫ్ చాలా చిన్నదిగా అనిపిస్తుంది,” యష్ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో సంజ‌య్ ద‌త్ ..అధీర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఆ మ‌ధ్య ఫ‌స్ట్ లుక్ కూడా విడుద‌ల చేశారు. సంజ‌య్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

హోమ్‌బేల్ ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మొదటి భాగాన్ని మించి యాక్షన్, మాఫియా ఉంటాయట. య‌శ్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో దుబాయ్ మాఫియాపై యష్ చేసే ఎదురుదాడులు సీక్వెల్‌లో హైలైట్ గా నిలవనున్నాయని అంటున్నారు. కోలార్ గోల్డ్ మైన్స్ సామ్రాజ్యాన్ని స్థాపించిన సూర్యవర్ధన్ బ్రదర్ గా సంజు బాబా కనిపించబోతున్నాడు.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

క్యాడర్ కుస్తీలు…అధినేతల భేటీలు

స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన టీడీపీ, జనసేన పార్టీల మధ్య ఇన్నేళ్ల స్నేహాన్ని విరోధంగా మార్చేసింది. ఇరు పార్టీల మధ్య…

4 minutes ago

CSK Star Ruled Out for 3 Months: IPL 2027 in Doubt?

Chennai Super Kings (CSK) have suffered a setback ahead of IPL 2027, as Ayush Mhatre…

16 minutes ago