Telugu

రాజమౌళి డేట్ పై కన్నేసిన కేజీఎఫ్ 2?

Rajamouli RRR KGF2 (కథలో కంటెంట్.. హీరోయిజం ఉంటే సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో నిరూపించింది మొన్న ఆ మధ్య విడుదలైన ‘కేజీఎఫ్’ మూవీ. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్స్‌ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. విడుదలైన అన్ని భాషలలోనూ సినిమా సక్సెస్ అయ్యింది. ఈ క్రమంలో సినిమా రెండో భాగం కూడా రూపొందిస్తున్నారు.

ఇటీవలే ఆ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. దానికి రెస్పాన్స్ అదిరిపోయింది. వేసవిలో సినిమాని విడుదల చెయ్యబోతున్నట్టు ఇప్పటికే చిత్రబృందం చెప్పింది. అయితే తాజాగా సినిమా వాయిదా పడుతుందని కొంత కాలంగా వినిపిస్తుంది. తాజాగా ఈ సినిమా జులై 30న విడుదల చెయ్యాలని చిత్రబృందం అనుకుంటున్నట్టు సమాచారం.

ADVERTISEMENT

గతంలో రాజమౌళి తన ఆర్ఆర్ఆర్ సినిమా ఆ రోజున విడుదల చెయ్యాలని అనుకున్నాడు. అయితే ఆ సినిమా వాయిదా పడటంతో ఇప్పుడు ఆ డేట్ కు కేజీఎఫ్ 2 ని తీసుకుని రావాలని అనుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ కోసం జులై 30 స్లాట్ టాలీవుడ్ కోలీవుడ్ లో ఖాళీగా ఉంచారు. దీనితో కేజీఎఫ్ 2 టీం అదే అనువైన డేట్ అంటుంది.

య‌శ్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో దుబాయ్ మాఫియాపై యష్ చేసే ఎదురుదాడులు సీక్వెల్‌లో హైలైట్ గా నిలవనున్నాయని అంటున్నారు. కోలార్ గోల్డ్ మైన్స్ సామ్రాజ్యాన్ని స్థాపించిన సూర్యవర్ధన్ బ్రదర్ గా సంజు బాబా కనిపించబోతున్నాడు. మొన్న ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో “ఒకసారి కేజీఎఫ్ 2 తెర మీద చూశాకా కేజీఎఫ్ చాలా చిన్నదిగా అనిపిస్తుంది,” యష్ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

GG’s Hyderabad Star Experiment Backfires: Fans React

Gautam Gambhir and the Indian team management faced questions after their decision to send Tilak…

5 hours ago

If Sandeep Gives Up, Prabhas In Trouble?

Prabhas might be one of the biggest superstars in Indian cinema, but there have been…

5 hours ago