
ఈ నెల 7 నుంచి 10 వరకూ జిల్లా కాంగ్రెస్ కమిటీలు ఆశావహుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించగా 175 శాసనసభ స్థానాలకు 1,090 మంది, 25 లోక్‌సభ స్థానాలకు 181 మంది ముందుకొచ్చారు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం ఇప్పటివరకూ దరఖాస్తు చేసుకోకాకపోవడం విశేషం. దీని బట్టి ఆయన అస్త్రసన్యాసం చేసేశారా అనే అనుమానాలు ఉన్నాయి. గత కొద్ది కాలంగా ఆయన కాంగ్రెస్ ను విడీ టీడీపీలో చేరతారు అనే వదంతులు కూడా వినిపిస్తున్నాయి.
టీడీపీలో చేరి తన ప్రత్యర్థయిన పెద్దిరెడ్డి కుటుంబంపై రాజంపేట పార్లమెంట్ కు పోటీ చేస్తారని వినిపిస్తుంది. కిరణ్ సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ లో చేరి ఎమ్మెల్సీ పదవి పొందారు. ఆయన వచ్చే ఎన్నికలలో కిరణ్ సొంత నియోజకవర్గమైన పీలేరు నుండి పోటీ చెయ్యడానికి సిద్ధం అవుతున్నారు. కిరణ్ పోటీ అంటూ చేస్తే టీడీపీ నుండే చేస్తారని లేకపోతే ఈ ఎన్నికలలో కూడా 2014 ఎన్నికల లాగే తెర వెనుకే ఉండిపోతారని తెలుస్తుంది.
BOTTOM LINE Packed with Youth Connect RATING 2.75/5 Story, Screenplay, Direction: Savin SA Cast: Vinayak…
Chennai Super Kings defeated Mumbai Indians by 103 runs in IPL 2026 at the Wankhede…