
ఇప్పుడు తాజాగా ఒక పేపర్ యాడ్ ఇచ్చింది చిత్ర బృందం. కొబ్బరి మట్ట మొదటి వారం కలెక్షన్ల అంచనా 233.64 కోట్లని పేపర్ యాడ్ ఇచ్చింది. అలాగే పక్కనే చిన్న స్టార్ పెట్టి రూపాయిలు కాదని ఒక కండిషన్ పెట్టింది అనుకోండి. ఈ పేపర్ యాడ్ కూడా ప్రేక్షకుల దృష్టిలో ఈ సినిమాను పడేసింది అనడంలో ఎటువంటి అనుమానం లేదు. 2015లో కొబ్బరిమట్ట అనే సినిమాను సంపూర్ణేష్ మొదలెట్టారు. కానీ పలు కారణాల వల్ల ఈ సినిమా విడుదల కాలేకపోయింది.
కొబ్బరి మట్ట బాక్స్ ఆఫీసు వద్ద నాగార్జున మన్మథుడు 2 తో పోటీ పడుతుంది. అలాగే అనసూయ నటించిన కథనం సినిమాతో కూడా. మంచి పోటీ సమయంలో విడుదల అవుతున్నా సినిమా బిజినెస్ బాగా జరుగుతుంది. రూపక్ రోనాల్డ్సన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ని హృదయకాలేయం డైరెక్టర్ సాయి రాజేష్ నిర్మిస్తున్నారు. ఇప్పటివరకూ వచ్చిన సంపూ సినిమాలు విడుదల ముందు మంచి బజ్ క్రీయేట్ చేసినా బాక్స్ ఆఫీస్ వద్ద తమ సత్తా చూపించలేకపోయాయి మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.
ఒకప్పుడు రాజకీయ పార్టీలు, వాటి అధినేతలు, నేతలు ప్రజాసేవ చేయడం కొరకే రాజకీయాలలోకి వచ్చామని చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు అలాంటి…
Nani’s The Paradise is facing another round of backlash after its Netflix premiere. The film…