Telugu

హలో హలో హలో… నేనొచ్చేసా… తిట్లు తెచ్చేసా…!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ‘బూతుల మంత్రి’గా అరుదైన కీర్తిని సొంతం చేసుకున్న గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, తన రాజకీయ మనుగడలో భాగంగా ఎప్పటికప్పుడు తనదైన శైలిలో మీడియా ముందుకు వచ్చి టిడిపి అధినేత చంద్రబాబు మరియు ఆయన తనయుడు లోకేష్ లపై బూతులతో దండెత్తడం కొత్త విషయమేమి కాదు.

ఓ నాలుగు రోజులు గడిస్తే తనను మరిచిపోతారేమో అన్న రీతిలో ప్రెస్ మీట్ లను నిర్వహించడం… తదుపరి తన ‘బూతు చాతుర్యాన్ని’ ప్రదర్శించడం మంత్రివర్యులకు పరిపాటే అన్న విషయం తెలియనిది కాదు. అయితే తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించలేదు గానీ… వివిధ మీడియా ఛానెల్స్ కు విడివిడిగా ఇంటర్వ్యూలు ఇచ్చి తన ప్రతిభను చాటుకునే ప్రయత్నం మరోసారి చేసారు. ‘ఎయిడెడ్’ స్కూల్స్ సందర్భంగా జరుగుతున్న రచ్చలో భాగంగా అనంతపురంలో ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు గుప్పించిన లోకేష్ పై తిట్ల దండకాన్ని అందుకున్నారు కొడాలి నాని గారు!

ADVERTISEMENT

‘ఒక పిల్ల పంది’ అంటూ లోకేష్ ను అభివర్ణించిన కొడాలి నాని ‘నా కొడకా రా నువ్వు… రారా… ముఖ్యమంత్రి గారి గుమ్మాన్ని ముట్టుకో… నిన్ను, నీ బాబు తోలు వలిచి ముఖ్యమంత్రి గారికి చెప్పులు కుట్టిస్తా…’ అంటూ తనదైన విధేయతను చాటుకున్నారు కొడాలి. ‘వన్స్ ఐ స్టెప్ ఇన్… బూతులు రిపీట్స్… ‘ అన్న రీతిలో సాగిన ఈ విమర్శల జడివాన ప్రారంభమైన కారణాన్ని కూడా నాని గారు వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను దున్నపోతు అని నారా లోకేష్ చేసిన విమర్శలకు ప్రతి సమాధానంలో భాగంగా ఈ మీడియా ఇంటర్వ్యూలు ఇచ్చారు.

Share
Jhansi

Jhansi is a senior writer with extensive experience covering Telugu movies and the broader Indian cinema landscape. With a keen focus on U.S. updates related to Telugu people and Indians, as well as immigration & …

Published by

Recent Posts

Varanasi: One Story, Seven Films Worth of Experiences

SS Rajamouli has an ambitious vision for Varanasi. The filmmaker described Varanasi as seven films…

5 minutes ago

Dil Raju’s Ranbir Moment Takes an Awkward Turn

Dil Raju praised Ranbir Kapoor at the Ramayana event, calling him one of the best…

35 minutes ago