
ఆన్లైన్లో నేరుగా విడుదల కాబోయే రెండవ తెలుగు చిత్రం ఇది. ఈ చిత్రం ఈ రోజు మే డే స్పెషల్గా విడుదల కావాల్సి ఉంది కాని లాక్డౌన్ కారణంగా అది సాధ్యపడలేదు. ఈ సినిమా జీ 5 లో ప్రసారం అయ్యే అవకాశం ఉంది. కృష్ణ అండ్ హిస్ లీలా షూటింగ్ 2019 ఆగస్టులో పూర్తయింది. విడుదల ఇప్పటికే ఆలస్యం అయింది.
కరోనా వైరస్ కారణంగా థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయో చెప్పలేని పరిస్థితి. దీనితో నిర్మాతలు మరింత వేచి ఉండలేరు. కావున ఈ నిర్ణయం తీసుకున్నారు. కృష్ణ అండ్ హిస్ లీలా సినిమాలో కొన్ని ప్రముఖమైన పేర్లు ఉన్నాయి. క్షణం ఫేమ్ రవికాంత్ పెరెపు ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, సిద్ధూ, శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలిని ముఖ్య పాత్రల్లో నటించారు.
అమృతారామమ్ నెగటివ్ టాక్, రివ్యూలతో మొదలు కావడంతో పెద్దగా ఆదరణకు నోచుకోలేదని సమాచారం. మరి ‘కృష్ణ అండ్ హిస్ లీలా’ సంగతి ఎలా ఉంటుందో చూడాలి. మరిన్ని సినిమాలు రానున్న రోజులలో ఆన్ లైన్ లో డైరెక్టుగా విడుదల అయ్యే అవకాశం కనిపిస్తుంది. వందల థియేటర్లు తన అధీనంలో ఉన్న సురేష్ బాబు కూడా ఇటువంటి నిర్ణయం తీసుకోకతప్పలేదు.
Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan's office has strongly denied social media rumours claiming…
The Telugu film industry has had a strange trend for the last few years. Films…