
ఈ నటి మొదటి సినిమా ఇంకా విడుదల కానప్పటికీ, ఆమె చేతిలో అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. ఆమె ఇప్పటికే నేచురల్ స్టార్ నాని యొక్క శ్యామ్ సింఘా రాయ్ లో భాగంగా ఉంది. అలాగే ఆమె మూడవ ప్రాజెక్ట్ ఇప్పటికే ప్రకటించబడింది. ఆమె సుధీర్ బాబు సరసన ఇంద్రగంటి మోహన్ కృష్ణ సినిమాలో కలిసి నటించనుంది.
అలాగే కప్పేల మలయాళ బ్లాక్ బస్టర్ యొక్క తెలుగు రీమేక్ కోసం కూడా ఆమె పరిశీలనలో ఉంది. మొదటి సినిమా రిలీజ్ కాకుండానే ఇంకో నాలుగు సినిమాలు సైన్ చెయ్యడం అంటే మాములు విషయం కాదు. ఈ నటి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో సినిమాకు 70 లక్షల వరకు డిమాండ్ చేస్తుందట.
ఒక కొత్త హీరోయిన్ కు 70 లక్షలు అంటే చాలా ఎక్కువ. అయితే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని అన్నట్టుగా ముందుకుపోతుంది ఈ అమ్మడు. హీరోయిన్ల కొరత ఉండటంతో నిర్మాతలు కూడా ఎంత కావాలంటే అంత ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. హీరో హీరోయిన్ల విషయంలో మాత్రం కరోనా ఎఫెక్ట్ చూసుకోవడం లేదు.
York Cinemas, the Canadian exhibitor for Jailer 2, issued a press note yesterday blaming North…
Nitesh Tiwari’s Ramayana, featuring Ranbir Kapoor, Sai Pallavi, Yash, and a big ensemble cast, is…