Telugu

“లెనిన్” సినిమా రివ్యూ: అయ్యగారి ఆగమన మార్గాన్ని సుగమం చేసిన లెనిన్!

చిత్రం: లెనిన్

M9 రేటింగ్: 2.5 /5

ADVERTISEMENT

విడుదల తేదీ: జూలై 10, 2026

తారాగణం: అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే, ప్రమోద్ పంజు, ఈశ్వరి రావు, శివాజీ తదితరులు

నిర్మాణ సంస్థ: మనం ఎంటర్ప్రైజస్ ఎల్ఎల్ పి – సితార ఎంటర్టైన్మెంట్స్

దర్శకత్వం: మురళి కిషోర్ అబ్బూరి

సంగీతం: తమన్

నిర్మాత: నాగవంశీ-నాగార్జున

ఛాయాగ్రహణం: లియోన్ బ్రిట్టో

కూర్పు: నవీన్ నూలి

“ఏజెంట్” అనంతరం ఓ మూడేళ్ల గ్యాప్ తర్వాత అఖిల్ అక్కినేని ఒక కొత్త అవతార్ లో “లెనిన్”గా ప్రేక్షకుల్ని పలకరించాడు. “వినరో భాగ్యము విష్ణు కథ” ఫేమ్ మురళి కిషోర్ అబ్బూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాని నాగవంశీతో కలిసి నాగార్జున ప్రొడ్యూస్ చేశారు. మరి “లెనిన్”తోనైనా అఖిల్ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యాడా? లేదా? అనేది చూద్దాం..!!

కథ:

భారతం మిట్ట అనే గ్రామంలో అనాథలా అడుగుపెడతాడు లెనిన్ (అఖిల్). తనను అక్కున చేర్చుకుని అన్నం పెట్టిన పెద్దమ్మ (ఈశ్వరి రావు)ను తల్లిగా భావించి, ఆమె కొడుకు వసంత్ (ప్రమోద్ పంజు)ను ప్రాణ స్నేహితుడిగా చూస్తూ అక్కడే ఉండిపోతాడు.

అయితే.. భారతం మిట్టలోకి అభిమన్యుడిగా ఎంటరైన లెనిన్, అనంతరం అర్జునుడిలా మారాల్సి వస్తుంది. ఆ మార్పుకు కారణం ఏంటి? కౌరవులు ఎవరు? పాండవులు ఎవరు? స్నేహితుళ్లు ఎవరు? వెన్నుపోటుదారులు ఎవరు? వంటి ప్రశ్నలకు సమాధానమే “లెనిన్” కథాంశం.

నటీనటుల పనితీరు:

అఖిల్ నటుడిగా తనలోని కొత్త కోణాన్ని పరిచయం చేసే ప్రయత్నం గట్టిగానే చేశాడు. లుక్స్ & బాడీ లాంగ్వేజ్ విషయంలో పర్వాలేదు కానీ.. హావభావాల ప్రకటన విషయంలో మాత్రం ఇంకాస్త పరిణితి అవసరమనిపించింది.

ఎమోషనల్ సీన్స్ & యాక్షన్ బ్లాక్స్ లో మాత్రం అలరించాడు అఖిల్. భాగ్యశ్రీకి చాలా మంచి పాత్ర దొరికింది. చలాకీ సన్నివేశాల్లో పర్లేదు కానీ.. ఎమోషనల్ సీన్స్ లో మాత్రం తేలిపోయింది.

“సలార్”లో ఒక కీలకపాత్రలో కనిపించిన ప్రమోద్ పంజు ఈ సినిమాలో ఒక కీలకపాత్ర పోషించాడు. అతడి ఎలివేషన్ సీన్స్ బాగా వర్కవుట్ అయ్యాయి. శివాజీ, ఈశ్వరి రావు, రాంకీ, బ్రహ్మాజీ, శత్రు, సునీల్ వంటి సీనియర్ ఆర్టిస్టులందరూ తమ బెస్ట్ ఇచ్చినప్పటికీ.. ఏ ఒక్కరి పాత్రకి సరైన క్యారెక్టర్ ఆర్క్ లేకపోవడం వల్ల ఎవ్వరూ సరైన ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయారు.

సాంకేతికవర్గం పనితీరు:

తమన్ పాటల్లో శుభమంగళం బాగుండగా.. మిగతావి అంతగా ఆకట్టుకోలేకపోయాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ తో మాత్రం సినిమాని వీలైనంత కాపాడాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ & క్లైమాక్స్ సీక్వెన్స్ ను ఎలివేట్ చేసిన తీరు మాస్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ చేస్తుంది.

సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకి వెన్నుముక. ఆడియన్స్ ను సినిమా యొక్క మూడ్ లోకి తీసుకెళ్లడంలో కానీ.. ఒక డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడంలో కానీ లియోన్ బ్రిట్టో సక్సెస్ అయ్యాడు. గత కొన్ని సినిమాలకు సోషల్ మీడియాలో చీవాట్లు తిన్న ఎడిటర్ నవీన్ నూలి “లెనిన్” విషయంలో చాలా అజాగ్రత్త పడ్డాడు. ఎక్కడా జంప్ కట్స్ కనిపించలేదు.

దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి చాలా పెద్ద కథను రెండున్నర గంటల సినిమాగా చెప్పాలనుకునే ప్రయత్నమే సాహసం. నిజానికి ఇదొక 10 ఎపిసోడ్ల వెబ్ సిరీస్ అంత కథ ఉన్న కంటెంట్. దాన్ని 169 నిమిషాల్లో చెప్పడానికి విశ్వప్రయత్నం చేశాడు కిషోర్. చాలా సినిమాలకి రన్ టైమ్ తగ్గించాలి అనుకుంటాం కదా.. ఈ సినిమాకి మాత్రం ఇంకాస్త లెంగ్త్ ఉంటే డైరెక్టర్ చెప్పాలనుకుంది పూర్తిగా చెప్పేవాడేమో అనిపించింది. అయితే.. చాలా కీ ట్విస్టులను రివీల్ చేసిన విధానం చాలా సింపుల్ గా ఉంటుంది. డ్రామా మీద ఆధారపడిన సినిమాలకి ఎమోషన్ వర్కవుట్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అది సినిమాలో మిస్ అయ్యింది. క్యారెక్టర్ ఆర్క్స్ అనేవి కనిపించలేదు.

మరీ ముఖ్యంగా ఈశ్వరి రావు క్యారెక్టర్ ఎందుకలా మారింది అనేందుకు సరైన జస్టిఫికేషన్ లేదు. అందువల్ల ఆ అంశం చుట్టూ అల్లుకున్న పాత్రలు, సన్నివేశాలు చాలా పేలవంగా అనిపిస్తాయి. చాలా కీలకమైన పాత్రలను కిషోర్ సింపుల్ గా కట్ చేసేసాడు. అందువల్ల సదరు పాత్రలను ఎందుకు ఎస్టాబ్లిష్ చేసినట్లు, ఎందుకు తప్పించినట్లు అనేది అర్థం కాదు. అలాగే.. హీరో తాలూకు బాధను ప్రేక్షకులు ఫీలయ్యే టైమ్ ఇవ్వలేదు. అక్కడి నుండి చాలా కంగారుగా సినిమాని పరిగెత్తించారు. అందువల్ల హీరోకి జరిగిన నష్టాన్ని, ఆ నష్టంలో హీరోకి కలిగిన బాధకు ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేదు. సో ఓవరాల్ గా చేలా పొటెన్షియల్ ఉన్న కథను క్లుప్తంగా చెప్పడం కోసం చేసిన ప్రయత్నంలో సోల్ ఆఫ్ లెనిన్ అనేది ఎలివేట్ అవ్వలేదు. ఆ కారణంగా దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు బొటాబొటి మార్కులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

విశ్లేషణ:

“లెనిన్” రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు. చాలా పొటెన్షియల్ ఉన్న డిఫరెంట్ కథ. కానీ.. దానికి అనవసరమైన కమర్షియాలిటీ జోడించి టెంప్లేట్ సినిమాలా మార్చేశారు. అందువల్ల ఒక మంచి విషాద ప్రేమకథగా నిలవాల్సిన ఈ చిత్రం రొటీన్ కమర్షియల్ సినిమాగా మిగిలిపోయింది. హీరోయిక్ ఇమేజ్ కంటే.. కథను హీరోగా చూడాల్సిన సినిమా ఇది. ఆ బ్యాలెన్స్ విషయంలో మేకర్స్ తడబడ్డారు. అందువల్ల ఒక స్టోరీతోనో లేక హీరో జీవితంలో జరిగిన విషాదమైన అంశంతోనో కనెక్ట్ అవ్వలేకపోయారు ప్రేక్షకులు. అయితే.. అఖిల్ కి నటుడిగా, హీరోగా ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఇచ్చే సినిమా ఇది. తమన్ బీజియం, ట్విస్టులు బాగానే ఉన్నాయి. కేవలం క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ వెళ్లిపోయిన ఫస్టాఫ్ ను క్షమించగలిగితే.. సెకాండాఫ్ పర్వాలేదు అనిపిస్తుంది. అందువల్ల.. మరీ ఎక్కువ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్తే, డీసెంట్ గా ఎంటర్టైన్ చేసే సినిమా “లెనిన్”.

ఓవరాల్ గా.. అయ్యగారి ఆగమన మార్గాన్ని సుగమం చేసిన లెనిన్!

M9 రేటింగ్: 2.5/5

Share
Kalyan

I strongly believe reviews are personal opinions. At the same time, they should help audiences set the right expectations without bias. That’s the principle I follow. We’ve noticed there is a lot of confusion around r…

Published by

Recent Posts

MS Subbulakshmi Amma Chose This Team

The grand launch of the M.S. A Legacy On Screen Launch event was held at…

7 hours ago

“Feel So Bad for London:” Hindu Ritual in London Sparks Debate.

An Instagram reel showing a chariot procession in Lewisham, London, has gone viral. The footage…

8 hours ago