
అయితే ఆ తరువాత కూడా ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావడం సవాలు. సామాజిక దూరం నిర్వహించడానికి రెండు లేదా మూడు సీట్లను ఖాళీగా ఉంచడం ద్వారా ప్రతి థియేటర్లో 50% టిక్కెట్లను మాత్రమే అమ్మడం, టికెట్ ధరల తగ్గింపు మొదలైనవాటితో ప్రేక్షకులకు సినిమా థియేటర్లకు రప్పించాలని వారు ఆలోచన చేస్తున్నారు.
ఇది ఇలా ఉండగా… లాక్డౌన్ సడలించిన తర్వాత మొదటి రెండు నెలల్లో చిన్న చిత్రాలకు అవకాశం ఇవ్వాలని సినీ పెద్దలు ఆలోచన చేస్తున్నారు. భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టడంతో పెద్ద సినిమాలు ఈ రిస్క్ తీసుకునే అవకాశం లేదు. అయితే చిన్న సినిమాలు మాములుగానే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికి ఇబ్బంది పడుతున్నాయి.
ఈ ఆఫర్ వారికి ఎంతవరకూ ఉపయోగపడుతుందో చూడాలి. ఒరే బుజ్జిగా, ఉప్పెన, నిశ్శబ్దం, రెడ్, వి, శ్రీకారం, సోలో బ్రతుకే సో బెటర్, మొదలైనవి విడుదల కోసం ఎదురుచూస్తున్న చిత్రాలు. ఒరే బుజ్జిగా, ఉప్పేనా మినహా మిగతా సినిమాలు ఈ రిస్క్ తీసుకునే అవకాశం లేకపోవచ్చు.
The game inside the palace becomes more competitive in Week 2 as suspicion turns into…
పీత కష్టాలు పీతవన్నట్లు సినీ పరిశ్రమలో ఎవరి కష్టాలు వారికున్నాయి. అవి వివిధ సందర్భాలలో బయటపడుతూనే ఉన్నాయి. ఇవన్నీ సినీ…