“మా ఇంటి బంగారం” సినిమా రివ్యూ: టైంపాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్!

చిత్రం: మా ఇంటి బంగారం

M9 రేటింగ్: 2.5/5

ADVERTISEMENT

విడుదల తేదీ: జూన్ 19, 2026

తారాగణం: సమంత, మంజూష ముక్కవల్లి, గుల్షన్ దేవయ్య, గౌతమి, శ్రీముఖి తదితరులు

నిర్మాణ సంస్థ: ట్రలాలా మూవింగ్ పిక్కర్స్

దర్శకత్వం: నందిని రెడ్డి

సంగీతం: సంతోష్ నారాయణన్

నిర్మాత: సమంత – రాజ్ నిడిమోరు – హిమాంక్ రెడ్డి

ఛాయాగ్రహణం: ఓం ప్రకాశ్

కూర్పు: ధర్మేంద్ర కాకరాల

సమంత ప్రధాన పాత్రలో స్వీయ నిర్మాణంలో రూపొందించి నటించిన చిత్రం “మా ఇంటి బంగారం”. సమంత ధర్మపతి రాజ్ నిడిమోరు సృష్టించిన ఈ బంగారం ప్రపంచానికి నందిని రెడ్డి నేతృత్వం వహించింది. బాషా టెంప్లేట్ హీరోయిన్ వెర్షన్ లో తీస్తే ఎలా ఉంటుంది అనే ప్రయత్నం ఈ చిత్రమని నందిని రెడ్డి ముందే చెప్పారు. మరి ఆ ప్రయత్నం ఏమేరకు ఫలించిందో చూద్దాం..!!

కథ:

బల్లవరం అనే గ్రామానికి పెద్ద అయినటువంటి రామరాజు (ఆనంద్) పెద్ద కుమారుడు అనిరుధ్ (దిగంత్) భార్యగా పెద్ద కుటుంబంలోకి అడుగిడుతుంది స్వర్ణ (సమంత). సగటు ఆదర్శ గృహిణికి ఉండాల్సిన లక్షణాలేవి లేని స్వర్ణ.. పద్ధతికి పెట్టింది పేరైన రామరాజు ఇంట్లో ఎలా నిలదొక్కుకోగలిగింది? అసలు స్వర్ణ ఎవరు? ఆమెకు ఝాన్సీ అనే పేరుతో ఉన్న గతం ఏమిటి? ఆ గతం ఆమె కుటుంబాన్ని వెంటాడి ఏ విధంగా ఇబ్బంది పెట్టింది? దాన్నుండి స్వర్ణ అలియాస్ ఝాన్సీ ఎలా బయటపడింది? అనేది “మా ఇంటి బంగారం” కథ.

నటీనటుల పనితీరు:

ఆల్రెడీ “ఫ్యామిలీ మ్యాన్, సిటాడెల్” లాంటి సిరీసుల్లో యాక్షన్ ఇరగ్గొట్టిన సమంతకి “మా ఇంటి బంగారం”లో స్వర్ణ పాత్రలో చీరతో యాక్షన్ చేయడం మినహా మిగతాదంతా కేక్ వాక్. ధైర్యం, తెగింపుతోపాటు నిస్సహాయతను కూడా చక్కగా ప్రదర్శించింది సమంత.

సమంత స్నేహితురాలిగా నటించిన మంజూష ముక్కవల్లి సినిమాకి హైలైట్ గా నిలిచింది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆమె కామెడీ టైమింగ్, ముఖంలో అమాయకత్వం కిరణ్మయి పాత్రని మరింత రంజింపజేశాయి. ప్రతి ఒక్కరి జీవితంలో కిరణ్మయి లాంటి ఫ్రెండ్ ఉండాలి అనిపించేలా ఆమె పాత్ర ఉంది. ఈ సినిమా తర్వాత ఆమె ఆర్టిస్టుగా బిజీ అవ్వడం ఖాయం.

గుల్షన్ దేవయ్య తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకోవడం మెచ్చుకొనే అంశమే అయినప్పటికీ.. క్యారెక్టర్ ఇంట్రడక్షన్ సీన్ లో అసలు లిప్ సింక్ లేకపోవడం ఇబ్బందిపెట్టింది. అలాగే అతని క్యారెక్టర్ సరైన ఆర్క్ కానీ జస్టిఫికేషన్ కానీ లేదు.

గౌతమి, శ్రీముఖి, చైతన్యకృష్ణ, దిగంత్, ఆనంద్ తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు:

ఒక ఫీమేల్ డైరెక్టర్ కోణంలో యాక్షన్ థ్రిల్లర్ చూడడం అనేది కొత్తగా అనిపించింది. చిన్న సీన్స్ కానీ.. సమంత మొదటిసారి తులసి కోట దగ్గరకి వచ్చినప్పుడు కుచ్చిళ్ళు మరీ పైకి దోపుకోవడం.. దాన్ని గమనించిన అత్తగారు చిన్నబుచ్చుకోవడం, తోడికోడళ్ల నడుమ పేరు కోసం పోటీని “ముత్యమంత పసుపు” పాటతో మొదలుపెట్టి.. అనంతరం అదే పాట రీమిక్స్ తో ఆ పోటీకి ముగింపు ఇవ్వడం, క్లైమాక్స్ లో అదే తులసి కోట దగ్గర విలన్ తో తలపడి మొక్కవోని మహిళగా సమంతను ప్రెజెంట్ చేయడం వంటి సన్నివేశాల్లో నందిని రెడ్డి మార్క్ కనిపించింది.

అయితే.. ఫ్యామిలీ డ్రామా మరియు ఎమోషనల్ సీన్స్ మ్యానేజ్ చేయడంలో కాస్త తడబడింది. విలన్ క్యారెక్టర్ ఆర్క్ ను సరిగా యూటీలైజ్ చేసుకోలేకపోయింది. ఫ్యామిలీ ఆర్క్ ని కూడా ఇంకాస్త బాగా ఎలివేట్ చేయాల్సింది. అది లేకపోవడం వల్ల ఆ ఫ్యామిలీ సేవింగ్ డ్రామా అనేది పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోయాం. మొత్తానికి దర్శకురాలిగా నందిని రెడ్డి బొటాబోటి మార్కులతో సరిపెట్టుకుంది.

సంతోష్ నారాయణన్ బ్యాగ్రౌండ్ స్కోర్ లో రెట్రో వెర్షన్ లా వినిపించాలి అనే తాపత్రయం మరీ ఎక్కువైంది. యాక్షన్ బ్లాక్ వరకు పర్లేదు కానీ.. మిగతా సీన్స్ లో తేలిపోయింది. పాటలు సోసోగా ఉన్నాయి.

సినిమాటోగ్రఫీ లో నైట్ షాట్స్ ఎఫెక్టివ్ గా లేవు. ఈవెనింగ్ షూట్ చేసి నైట్ ఫిల్టర్ వేయడం వల్ల ఆ అథెంటిసిటీ మిస్ అయ్యింది. యాక్షన్ కొరియోగ్రఫీ సహజంగా ఉన్నప్పటికీ.. ఇంకాస్త క్లవర్ టేకింగ్ అవసరం అనిపించింది. ఎడిటింగ్ ప్యాటర్న్ బాగుంది. ట్రాన్సిషన్స్ బాగా ప్లాన్ చేసారు.

రాజ్ ప్లానింగో లేక నందిని ప్లానింగో తెలియదు కానీ.. యాక్సిడెంట్ సీన్ మరియు క్లైమాక్స్ ఫైట్ టైంలో వచ్చే జీప్ సీన్ ని చాలా తెలివిగా బడ్జెట్ కంట్రోల్ చేస్తూ.. సదరు సన్నివేశాల తాలూకు తీవ్రత మాత్రం ఆడియన్స్ కి అర్థమయ్యేలా చేసారు. ఎడిట్ లోనూ అదే మ్యాజిక్ ని ఫాలో అయ్యారు.

విశ్లేషణ:

ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని మరింత ఆసక్తికరంగా రాసుకొని.. విలన్ ఆర్క్ ని కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసి ఉంటే “మా ఇంటి బంగారం” బ్లాక్ బస్టర్ గా నిలిచేది. అయినప్పటికీ.. సమంత పెర్ఫార్మెన్స్, స్టైలిష్ యాక్షన్ కొరియోగ్రఫీ, మంజూష ముక్కవల్లి ఆర్గానిక్ కామెడీ టైమింగ్ కోసం “మా ఇంటి బంగారం” సినిమాని హ్యాపీగా ఒకసారి చూడొచ్చు.

ఓవరాల్ గా.. టైంపాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్!

M9 రేటింగ్: 2.5/5

Share
Kalyan

I strongly believe reviews are personal opinions. At the same time, they should help audiences set the right expectations without bias. That’s the principle I follow. We’ve noticed there is a lot of confusion around r…

Published by

Recent Posts

Vishwaksen’s CULT Release Date Announced

A dark cinematic universe is taking shape with #CULT, the film led by Vishwaksen. The…

9 minutes ago

ప్యారడైజ్ సౌత్ టూర్ అయిపోవచ్చింది.. ఇంపాక్ట్ సరిపోతుందా ?

ప్యారడైజ్ సినిమాకి ట్రైలర్ లేకుండానే ప్యాన్ ఇండియా ప్రమోషన్స్ చేసేస్తున్నాడు నాని. చెన్నై, బెంగుళూరు, కొచ్చి వెళ్లి.. అక్కడ మీడియా…

21 minutes ago