Telugu

రిలీజ్ కు ముందు ఎవరైనా ఊహించారా!

మహానటి…. సావిత్రి జీవితగాధతో తెరకెక్కుతోన్న సినిమా అన్న విషయం అందరికీ తెలిసిందే. అంత గొప్ప నటి కధ అయినప్పటికీ దర్శకుడు, నటీనటులు మార్కెట్ లో క్రేజ్ ఉన్న వారు కాకపోవడంతో, ఈ సినిమాపై ఎవరికీ ఎలాంటి అంచనాలు లేవు. కానీ సినిమా విడుదలైన తర్వాత పరిస్థితి చూస్తే… ఇండస్ట్రీలో నాగ్ అశ్విన్ పేరు ప్రస్తుతం హాట్ టాపిక్. ఎంతగా అంటే… ఏకంగా చిరంజీవే ఇంటికి పిలిచి ఆఫర్ ఇచ్చేటంత! ఇక కీర్తి సురేష్ విషయం చెప్పనవసరం లేదు, ఈ ఏడాది అవార్డులన్నీ ఆమెకు దాసోహం కావాల్సిందే.

ADVERTISEMENT

ఇలా విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా కనవర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా యుఎస్ మార్కెట్ లో ఏకంగా 2 మిలియన్ డాలర్స్ ను టచ్ చేయడం, నిజంగా రిలీజ్ కు ముందు ఎవరూ అంచనాలు వేసింది కాదు. ప్రీమియర్స్ నుండే మొదలైన దూకుడు నేడు 2 మిలియన్స్ కు చేరుకునే వరకు నిరంతరంగా కొనసాగుతూనే ఉంది. అయితే 2 మిలియన్ నుండి ఎంతవరకు ‘మహానటి’ లాగుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ వీకెండ్ లో కూడా అదే దూకుడు ప్రదర్శిస్తే… ఖచ్చితంగా 2.5 మిలియన్స్ కు పై మాటే!

యుఎస్ బాక్సాఫీస్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వసూళ్లు మంచి జోరుమీదున్నాయి. ఈ సినిమా విడుదలయ్యే నాటికి ‘రంగస్థలం, భరత్ అనే నేను, నా పేరు సూర్య’ వంటి మూడు పెద్ద చిత్రాలు మార్కెట్ లో ఉన్నా, ప్రస్తుతం హౌస్ ఫుల్ బోర్డులు పెడుతోంది మాత్రం ఒక్క “మహానటి”కే! ‘రంగస్థలం’ ఇప్పటికే 50 రోజులు పూర్తి చేసుకోగా, ‘భరత్ అనే నేను’ 30 రోజులు పూర్తి చేసుకుంది. ఇక ‘నా పేరు సూర్య’ ప్రభావం ఈ సినిమాపై అస్సలు ప్రభావితం చూపకపోగా, ఈ సినిమా ప్రభావమే ‘నా పేరు సూర్య’పై పడడం విశేషం.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

YCP Dhurandhar In PK’s Pithapuram?

Covert operations are very normal and relevant in today’s politics. Every party has informers and…

15 minutes ago

Explosive Summer 2027: Rs 5000 Crores Box Office Target

Tollywood’s summer season has always been seen as a gold mine for the industry, almost…

35 minutes ago