Telugu

మోడీ సూట్ లో మహేష్ బాబు!

నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత, ఆయన ధరించిన సూట్ ఓ ‘ట్రెండ్ సెట్టర్’గా మారిన విషయం తెలిసిందే. నిజానికి ఆ తరహా డ్రెస్ కు ఏకంగా ‘మోడీ సూట్’ అంటూ మార్కెట్ వర్గాలు నామకరణం చేసేసాయి. అప్పటివరకు ఉన్న ప్రధానమంత్రులు ధరించిన డ్రెస్ లకు విభిన్నంగా మోడీ సూట్ ను తయారు చేయించుకోవడంతో, ఆ సూట్ కు ‘మోడీ’ పేరు వచ్చేసింది. అయితే ప్రధానమంత్రులే కాదు, ముఖ్యమంత్రులు కూడా ఈ సూట్ ను ధరించుకోవచ్చని ప్రిన్స్ మహేష్ బాబు చెప్తున్నారు.

ADVERTISEMENT

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న “భరత్ అనే నేను” సినిమాలో ప్రిన్స్ మహేష్ బాబు ముఖ్యమంత్రి గెటప్ లో కనిపించనున్న విషయం తెలిసిందే. దీంతో సిఎం లుక్ లో మహేష్ బాబు ఎలా ఉంటారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారికి సోషల్ మీడియాలో ఓ ఫోటో తారసపడింది. మోడీ సూట్ ధరించి దర్శనమిచ్చిన మహేష్ బాబు లుక్ అదిరింది. అన్నపూర్ణ స్టూడియోస్ జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ లో భాగంగా, ఈ ఫోటో సోషల్ మీడియాకు ఎక్కడంతో, ప్రిన్స్ ఫ్యాన్స్ షేర్ చేసుకుంటూ పండగ చేసుకుంటున్నారు.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

OG Universe Update: Sujeeth Teases Small Treat

Pawan Kalyan’s birthday celebrations are getting another update from the team of OG. Director Sujeeth…

11 minutes ago

Toxic Tuesday Figures Raise Fresh Concerns

Toxic is slowing down at the box office, and Tuesday’s numbers have added to the…

21 minutes ago