
ప్రస్తుతం “బ్రహ్మోత్సవం” సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న మహేష్ ఆన్ సెట్స్ ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. చెక్స్ షర్టుతో సింపుల్ గా ఉన్న మహేష్ కటౌట్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. పక్కనే అందాల బొమ్మ హీరోయిన్ సమంత ఉన్నా, ప్రిన్స్ ఛార్మింగ్ ముందు ‘కుందనపు బొమ్మ’ వెలవెలబోతోంది అనే విధంగా ప్రిన్స్ తారసపడుతున్నారని అభిమానులు ఫేస్ బుక్, ట్విట్టర్ లలో చేస్తున్న సందడి మామూలుగా లేదు.
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించే సినిమాలలో హీరో చాలా సాధారణంగా కనపడుతుంటారు. వీరిద్దరి కాంభినేషన్ లో వచ్చిన “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” సినిమాలోనూ ప్రిన్స్ చాలా సింపుల్ కాస్ట్యూమ్స్ తో అలాగే దర్శనమిచ్చారు. తాజా “బ్రహ్మోత్సవం”లో కూడా అదే పంథాను ఫాలో అవబోతున్నారని తాజా కటౌట్ చెప్పకనే చెబుతోంది. అయితేనేం… సింపుల్ గా ఉన్నా… ప్రిన్స్ అదిరిపోవడంతో ఫ్యాన్స్ పిచ్చ హ్యాపీ!
Matthu Vadalara fame Athulya Chandra and actor Bibin have been arrested in Kerala for allegedly…
Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu criticised YSRCP president YS Jagan Mohan Reddy over…