Telugu

శ్రీమంతుడి బాటలోనే మహేష్ బాబు మహర్షికి కూడా ఏదైనా చేస్తారా?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక 25వ చిత్రం మహర్షి మిశ్రమ టాక్ తో మొదలైనా వేసవి సెలవుల కారణంగా మంచి కలెక్షన్లు రాబడుతుంది. 80 కోట్ల షేర్ వైపు దూసుకుపోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం మహేష్ బాబు చాలానే కష్టపడుతున్నారు. ప్రతీ సినిమా తరువాత విదేశాలకు ఫ్యామిలీతో సహా హాలిడే కి వెళ్లే అలవాటు ఉన్నా ఈ సారి అది క్యాన్సల్ చేసుకుని సినిమా కోసం మరింతగా పబ్లిసిటీ చెయ్యాలని నిర్ణయించుకున్నారు మహేష్ బాబు.

ADVERTISEMENT

సినిమాలో చెప్పినట్టుగా వీకెండ్ వ్యవసాయం గురించే మొత్తం సినిమా పబ్లిసిటీ నడుస్తుంది. వ్యవసాయం గురించి రైతుల గురించీ మహేష్ బాబు వెళ్లిన చోటల్లా గొప్పగా చెబుతున్నారు. అయితే ఇది కేవలం సినిమా వరకూ నేనా లేక నిజజీవితంలో కూడా మహేష్ బాబు భావి తరాలకు స్ఫూర్తినిచ్చేలా ఈ విషయంలో ఏమైనా చేస్తారా అనేది చూడాలి. గతంలో శ్రీమంతుడు సినిమాలో పల్లెల దత్తతు గురించి చెప్పి ఆ తరువాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఒక్కో ఊరుని దత్తతు తీసుకున్నారు.

ఏదో పేరుకు దత్తతు తీసుకుని వదిలెయ్యకుండా అక్కడ విరివిగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే వ్యవసాయం గురించి కూడా ఏదైనా చేస్తారేమో చూడాలి. మహర్షి మీద దాదాపుగా 100 కోట్ల బిజినెస్ జరిగింది. వచ్చే రెండు మూడు వారలు చెప్పుకోదగ్గ సినిమాలేమీ లేకపోవడంతో సినిమా ఆ మొత్తాన్ని కలెక్టు చేస్తుందని సినిమా టీం నమ్మకంగా ఉన్నారు. మహర్షి తరువాత మహేష్ బాబు ఎఫ్2 వంటి భారీ హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడితో తన తదుపరి చిత్రం చెయ్యబోతున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా విడుదల అవుతుంది.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

Pics: Malavika Stuns In Regal Red Ethnic Glam

Malavika Mohanan slips into this red ethnic fantasy and instantly turns every frame into a…

24 minutes ago

Darling For Producers, But Trolled On Social Media!

Telugu cinema and perhaps the entire stretch of Indian cinema for that matter has been…

44 minutes ago