మహేష్ ‘బిరుదు’లకు టాలీవుడ్ లో ‘ఫుల్’ డిమాండ్!

టాలీవుడ్ ను ఏలుతున్న మహేష్ బాబును అభిమానులంతా ముద్దుగా ‘ప్రిన్స్’ అని పిలుచుకుంటున్న విషయం తెలిసిందే. అలాగే మహేష్ స్టార్ డమ్ ను దృష్టిలో పెట్టుకుని ‘సూపర్ స్టార్’ అంటుంటారు. ఇలా రెండు బిరుదులతో తెలుగు సినీ సామ్రాజ్యంలో తనదైన ముద్ర వేసిన మహేష్ ప్రస్థానం ‘బాల్యం’ నుండే ప్రారంభమైంది. ‘నీడ’ సినిమా నుండి ‘బాలచంద్రుడు’ వరకు దాదాపు 9 చిత్రాల్లో నటించిన మహేష్, అప్పట్లోనే ‘స్టార్’ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. బాల్యంలోనే చిచ్చరపిడుగు లాంటి అభినయాలను అలవోకగా ప్రదర్శించిన మహేష్ ను ‘ఒమెగా స్టార్’గా కీర్తించేవారు. ‘బాలచంద్రుడు, అన్న-తమ్ముడు’ వంటి సినిమాలకు ‘ఒమెగాస్టార్’గా పేర్లు పడ్డాయి.

1990లో కనుమరుగైన ఆ బిరుదు మళ్ళీ 25 సంవత్సరాల తర్వాత ‘లోఫర్’ సినిమాతో వినపడుతోంది. పూరీ దర్శకత్వంలో రూపొందిన ‘లోఫర్’ సినిమాలో వరుణ్ తేజ్ నటనను కొనియాడే క్రమంలో దర్శకుడు రాంగోపాల్ వర్మ వరుణ్ ను ‘ఒమెగాస్టార్’గా కీర్తించారు. ప్రస్తుతం ఉన్న హీరోలలో ఎవరినీ ‘ఒమెగాస్టార్’గా కీర్తించకపోవడం మరియు ‘మెగా’ బ్రాండ్ కూడా ఉండడంతో వరుణ్ కు వర్మ సూచించిన బిరుదే సరైనదిగా మెగా అభిమానులు సైతం అంగీకరిస్తున్నారు. అయితే ఇది ఒకప్పటి మహేష్ బిరుదన్న విషయం అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన విషయం!

ADVERTISEMENT

ఇదిలా ఉంటే, మహేష్ ను అభిమానులు ముద్దుగా పిలుచుకునే ‘ప్రిన్స్’ కోసం కూడా తీవ్ర పోటీ నెలకొంది. వరుణ్ తేజ్ ను ఏకంగా చిరంజీవే ‘మెగా ప్రిన్స్’గా కొనియాడగా, అక్కినేని నట వారసుడు అఖిల్ ను ‘యువ ప్రిన్స్’గా అభివర్ణించారు. మహేష్ డేట్లుకే కాదు, మహేష్ బిరుదుల కోసం కూడా తెలుగు సినీ పరిశ్రమలో గట్టి పోటీ నెలకొందన్న మాట.

Share
Published by

Recent Posts

డీఎస్సీపై వివాదం.. పాఠశాలలో ఘటనపై మాజీ సైనికుడి ఫిర్యాదు

కుప్పం మండలం నడిమూరు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, మాజీ సైనికుడు వి. చక్రపాణి రెడ్డి ‘సాక్షి’ మీడియా ప్రతినిధులపై ఫిర్యాదు చేసినట్లు…

1 minute ago

Mammootty & Dhanush Bring Pure Dhurandhar Magic to Om

Today, Malayalam actor Mammootty is celebrating his 75th birthday and as a birthday special for…

9 minutes ago