కేటీఆర్ కే కాదు, హరీష్ రావుకు కూడా పట్టాభిషేకం!

ఇటీవల జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కేసీఆర్ తనయుడు కేటీఆర్ పై సోషల్ మీడియా కురిపించిన ప్రశంసలు తెలిసిన విషయమే. “నాన్నకు ప్రేమతో…” అంటూ కేసీఆర్ – కేటీఆర్ లున్న ఫోటోలు ఫేస్ బుక్, ట్విట్టర్ లలో సృష్టించిన సందడి సోషల్ మీడియా విజ్ఞులకు తెలిసిందే. అయితే కేటీఆర్ కే కాదు, హరీష్ రావుకు సోషల్ మీడియాలో విపరీతమైన అభిమానులున్నారని ప్రస్తుతం హల్చల్ చేస్తున్న టైటిల్స్, ఫోటోలు చెబుతున్నాయి.

ADVERTISEMENT

కేసీఆర్ కు మేనల్లుడైన హరీష్ రావు నారాయణఖేడ్ ఎన్నికలలో సత్తా చాటారని, దీంతో అల్లుడు సత్తా చాటి… “అల్లుడా… మజాకా…” అనిపించుకున్నారని, అలాగే ఇదే సమయంలో కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ విజయాన్ని కేసీఆర్ కు బహుమతిగా ఇస్తూ తన మామ మీదున్న ప్రేమను చాటి… “మామకు ప్రేమతో…” అన్న టైటిల్ కు సార్థకతను చేసారని… ఇలా ఎవరి క్రియేటివిటీకు అనుగుణంగా వారు పోస్టర్లతో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. నారాయణఖేడ్ ఉప ఎన్నికల విజయం అందించిన ఉత్సాహం అలాంటిది మరి!

Share
Published by

Recent Posts

Karan Johar Sidelined Regina for Being a South Indian?

The debate over Bollywood actresses' comments on South Indian cinema has taken another turn. After…

33 minutes ago

అయ్యో పాపం చెవిరెడ్డి… పులివర్తి సుధా రెడ్డి ర్యాగింగ్!

నేడు తిరుపతి జిల్లా చంద్రగిరిలో అనూహ్య సంఘటన జరిగింది. పరిషత్ ఎన్నికల్లో దాదాగిరి చేద్దామని వచ్చిన మాజీ మంత్రి చెవిరెడ్డి…

53 minutes ago