
హైదరాబాద్‌లోని మోహన్‌బాబు నివాసంలో శుక్రవారం చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌తో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ముహూర్తపు షాట్‌కు విరానికా మంచు, ఐరా, అవ్రమ్ కెమెరా స్విచ్చాన్ చేయగా, లక్ష్మీ మంచు, విద్యానిర్వాణ సంయుక్తంగా క్లాప్ నిచ్చారు. విష్ణు మంచు గౌరవ దర్శకత్వం వహించారు.
అరియానా, వివియానా సంయుక్తంగా స్క్రిప్టును డైరెక్షనల్ టీమ్‌కు అందించారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సైతం ఈరోజే మొదలైంది. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే… మోహన్‌బాబు స్వయంగా స్క్రీన్‌ప్లే సమకూరుస్తున్నారు. డైమండ్ రత్నబాబు, తోటపల్లి సాయినాథ్ సంభాషణలు రాస్తున్నారు.
ఇదివరకెన్నడూ కనిపించని అత్యంత పవర్ఫుల్ రోల్లో డాక్టర్ మోహన్‌బాబు నటిస్తోన్న ఈ తరహా కథ కానీ, ఈ జానర్ సినిమా కానీ ఇప్పటివరకూ టాలీవుడ్లో రాలేదని చిత్రబృందం చెప్పడం విశేషం. అలాగే ఈ చిత్రానికి మేస్ట్రో ఇళయరాజా సంగీత స్వరాలు సమకూరుస్తున్నారు. అలాగే మోహన్‌బాబుకు స్టైలిస్ట్‌గా విరానికా మంచు వ్యవహరిస్తుండటం విశేషం.
York Cinemas, the Canadian exhibitor for Jailer 2, issued a press note yesterday blaming North…
Nitesh Tiwari’s Ramayana, featuring Ranbir Kapoor, Sai Pallavi, Yash, and a big ensemble cast, is…