
దీనిపై నెటిజెన్లు కామెంట్లు విసురుతున్నారు. అసలు ప్రసవం లైవ్ ఇవ్వడం ఏంటో, దానికి కాజల్ అగర్వాల్ తో డిస్కషన్ ఏంటో అని వారు తలలు పట్టుకుంటున్నారు. కొందరైతే ఈ ఐడియాను తిడుతున్నారు కూడా… కొందరు మీ సినిమాల్లాగే ఈ ఐడియా కూడా ఉంది అంటూ సెటైర్లు విసురుతున్నారు. మరి విష్ణు ఏ అభిప్రాయంతో ఈ పనికి పూనుకున్నాడో. విష్ణు తదుపరి చిత్రం కన్నప్పలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా చేస్తుంది. ఆ రకంగా వీరి మధ్య స్నేహం మొదలైనట్టు ఉంది.
2018లో వచ్చిన ఆచారి అమెరికా యాత్ర తరువాత విష్ణు తన తదుపరి చిత్రం ఏదీ మొదలు పెట్టలేదు. ఎప్పటి నుండో రిలీజ్ కు నోచుకోని ఓటర్ సినిమా ఆ మధ్య విడుదల అయ్యింది. దర్శకనిర్మాతలతో ఉన్న విబేధాల కారణంగా విష్ణు ఈ సినిమా ప్రొమోషనలకు దూరంగా ఉన్నాడు. సినిమా విడుదలపై స్టే కు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. మొదటి రోజే చాలా చోట్ల సినిమా తీసేశారు. దీనితో విష్ణు కన్నప్పతో పెద్ద హిట్ కొట్టాలని కృతనిశ్చయంతో ఉన్నాడు.
ఒకప్పుడు రాజకీయ పార్టీలు, వాటి అధినేతలు, నేతలు ప్రజాసేవ చేయడం కొరకే రాజకీయాలలోకి వచ్చామని చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు అలాంటి…
Nani’s The Paradise is facing another round of backlash after its Netflix premiere. The film…