
కబీర్ సింగ్ దర్శకుడు సందీప్ వంగా నిన్న ఒక బాలీవుడ్ జర్నలిస్ట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ సంచలనం అవుతుంది. ప్రేమలో ఉన్న ఇద్దరు ఒకరినొకరు కొట్టుకునే స్వేచ్ఛ లేకపోతే వారి మధ్య నిజమైన ప్రేమ లేనట్టే అని ఆయన చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతుంది. దీనిపై చిన్మయి ఘాటుగానే స్పందించింది. మహిళలపై హింసను ప్రేరేపిస్తున్నారు అంటూ విరుచుకుపడింది. మహిళను కొడితే అది ప్రేమే కాదు అంటూ వాదిస్తుంది. ఇందులో ఎవరు తప్పు ఎవరు ఒప్పు అనేది పక్కనపెడితే ఈ విషయంలో సందీప్ కు మద్దతు ఎక్కువగా ఉంది.
వారితో చిన్మయి సోషల్ మీడియాలో చిన్నపాటి యుద్ధమే చేస్తుంది. వారు చిన్మయితో పాటు పనిలోపనిగా రాహుల్ ని కూడా ఏసుకుంటున్నారు. మన్మథుడు 2 ఆగష్టు 9న విడుదల చెయ్యడానికి సిద్ధం అవుతున్నారు. ఈ తరుణంలో ఇటువంటి రభస ఏంటో అని రాహుల్ తలపట్టుకుంటున్నాడు. అదే సమయంలో భార్యామణిని ఏమి అనలేని, ఆపలేని పరిస్థితి. మరోవైపు ఈ ప్రభావం మా సినిమా మీద పడకుండా ఉంటే చాలు అనుకుంటున్నారు అక్కినేని అభిమానులు.
Miloni Jhonsa walks into these frames like she knows the camera is hooked. Draped in…
The saddest part of Javed Akhtar’s post defending Rashmika Mandanna is not his intention, but…