
ఈ సినిమా వరల్డ్ వైడ్ థియేటర్ రైట్స్ వేల్యూ 18.4 కోట్లు. ఆ మేరకు రాబడితేనే సినిమా హిట్ అనవచ్చు. ఈ టాక్ తో ఆ మేరకు రాబట్టడం దాదాపుగా అసంభవం. ఈ వారాంతంలో ఎంత వస్తే అంతే ఫైనల్ అనుకోవచ్చు. స్వాతంత్ర దినోత్సవం సెలవు ఉన్నా ఈ టాక్ తో, పైగా రెండు కొత్త చిత్రాల విడుదలతో పెద్దగా అడ్వాంటేజ్ ఉండకపోవచ్చు. అన్ని ఏరియాలలో ట్రేడ్ కనీసం 50-70% పోతుందని అంచనా వేస్తారు. కొన్ని ఏరియాస్ లో ఈ లాస్ 80% వరకూ ఉండవచ్చని కూడా అంటున్నారు.
మన్మథుడు 2 ప్లాప్ అయితే నాగార్జున కేరీర్ లో ఇది వరుసగా నాలుగో ప్లాప్ అని చెప్పవచ్చు …. నిర్మలా కాన్వెంట్, రాజుగారి గది 2, ఆఫీసర్ ఇప్పటికే ప్లాపులుగా ఉన్నాయి. 2016లో విడుదలైన ఊపిరి తరువాత నాగార్జునకు హిట్ లేదని చెప్పవచ్చు. అక్కినేని అభిమానులు దీనితో కృంగిపోతున్నారు. ఇప్పటికే అఖిల్ కూడా కేరీర్ లో ఒక్క హిట్ కూడా లేకుండా అయ్యింది. ఈ సంవత్సరంలో నాగ చైతన్య మజ్ను, సమంత ఓ బేబీ మాత్రమే అక్కినేని పరువు నిలబెట్టాయి.
Andhra Pradesh is bracing for a potentially severe cyclone as the weather system over the…
Nikhil Siddhartha has shared an update on his upcoming pan-India adventure, Swayambhu, confirming that the…