పెళ్లి ఎఫెక్ట్ : ఈ హీరో బాగా ‘లావు’ అయ్యాడు!

పెళ్ళయిన తర్వాత దంపతుల శారీరక ఆకృతులలో మార్పులు సహజమే. అయితే సినీ సెలబ్రిటీలు మాత్రం వారికుండే క్రేజ్ మరియు సినీ అవకాశాల దృష్ట్యా ఈ విషయంలో కాస్త జాగ్రత్తలు పాటిస్తారు. కానీ కొందరు సెలబ్రిటీలు మాత్రం వీటికి అతీతంగా వ్యవహరిస్తుంటారు. ఆ జాబితాలో మంచు మనోజ్ కూడా చేరిపోయాడు అంటున్నారు నెటిజన్లు.

ఇటీవల విడుదలైన “శౌర్య” టీజర్ లో మనోజ్ చాలా బరువెక్కి ఉండడం అందరూ చూసిందే. దీనిపై సోషల్ మీడియాలో మనోజ్ పై సైటైర్లు బాగానే పడుతున్నాయి. టీజర్ ఎలా ఉందో చెప్పండి అంటూ మనోజ్ చేసిన వ్యాఖ్యలకు… నువ్వు చాలా సన్నగా ఉన్నావు, కాస్త లావైతే బాగుంటుంది అని నెటిజన్లు కౌంటర్ వేయగా, మరింత అవాక్కయ్యే రీతిలో ‘ట్రై’ చేస్తాను అంటూ మనోజ్ బదులివ్వడం విశేషం.

ADVERTISEMENT

గత సంవత్సరం మే 20వ తేదీన ప్రణతిరెడ్డితో వివాహమైన తర్వాత మంచు మనోజ్ నటించిన తొలి చిత్రంగా “శౌర్య” విడుదలవుతోంది. సైటైర్లు, జోకులు పక్కన పెడితే ఈ సినిమా టీజర్లో మనోజ్ ఫ్రెష్ లుక్ తో దర్శనమిస్తున్నాడు. సెటిల్ద్ యాక్టింగ్ తో ఆకట్టుకోవాలని మనోజ్ చేస్తున్న ప్రయత్నం ఎంతవరకు సఫలీకృతమవుతుందో చూడాలి.

Share
Published by

Recent Posts

Naga Chaitanya’s Vrushakarma: Makers Playing with Fire?

Naga Chaitanya's Vrushakarma has reached a point where the silence itself is becoming a problem.…

30 minutes ago

బాలయ్య వారసత్వం మోక్షజ్ఞ చేతుల్లో… అసలు పరీక్ష మొదలు

నందమూరి బాలకృష్ణ అటు సినిమాల్లో, ఇటు రాజకీయాల్లో విజయవంతంగా కొనసాగుతున్నారు. హిందూపురం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సీనియర్…

31 minutes ago