చిరు ‘తనయ’ని వదల అంటున్న ‘మీడియా!’

సెలబ్రిటీలు ఎక్కడ ఉంటే సహజంగా మీడియా కూడా అక్కడే ఉంటుంది. అలాగే సెలబ్రిటీ కుటుంబానికి చెందిన వార్తలకైనా విపరీతమైన ప్రాధాన్యతనిస్తుంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ రెండవ కుమార్తె శ్రీజను మీడియా వదల అంటే వదలనంటోంది.

మెగాస్టార్ చిరంజీవి రెండవ కుమార్తె శ్రీజ ఇటీవల బెల్లీ డ్యాన్స్ నేర్చుకుంటోందని… త్వరలోనే వెండితెరపై గానీ, బుల్లితెరపై గానీ సందడి చేయవచ్చు అంటూ సోషల్, వెబ్ మీడియాలలో ఇటీవల జరిగిన ప్రచారం తెలిసిందే. అయితే ఈ వార్తలపై మెగా ఫ్యామిలీ ఎటువంటి స్పందనను వ్యక్తపరచక పోవడంతో ఎటువంటి స్పష్టత రాలేదు.

ADVERTISEMENT

ఈ వార్తలకు ‘శుభంకార్డు’ పడకముందే శ్రీజకు మరో ‘శుభలేఖ’ రెడీ అవుతోందన్న ప్రచారం సోషల్ మీడియాలో ఊపందుకుంది. అమెరికాకు చెందిన ఓ ఎన్నారైతో శ్రీజ వివాహాన్ని పెద్దలు కుదిర్చారని, దీనికి సంబంధించి ఓ లాంచన కార్యక్రమం కూడా పూర్తయ్యిందని, ఈ ఏడాది మే లోపున వివాహం జరగవచ్చని ఈ వార్తల సారాంశం.

కొన్ని వ్యాపారాలు చేస్తూ అమెరికాలో స్థిరపడ్డ ఎన్నారైతో శ్రీజ వివాహం అన్న వార్తలలో ఎంత వాస్తవం ఉందో తెలియాలంటే ఈ సారి మెగా ఫ్యామిలీ స్పందించాల్సిందే! ఏది ఏమైనా భరద్వాజ్ తో ఆర్య సమాజ్ తో మొదలైన శ్రీజకు – మీడియాకు ఉన్న సంబంధం నిరంతరం కొనసాగేలా కనపడుతోంది.

Share
Published by

Recent Posts

BB10: Who Is Strong & Who Gets Sympathy?

The tenth edition of the Bigg Boss Telugu TV show is live. Nagarjuna Akkineni returned…

2 hours ago

Varanasi AP/TG Business: Too Massive a Deal for Mahesh?

Mahesh Babu’s Varanasi, directed by SS Rajamouli, is already one of the biggest films in…

5 hours ago