
తెలుగు టాప్ హీరో అయిన పవన్ కళ్యాణ్ తో షూటింగ్ ను స్థానిక లొకేషన్స్ లో జరపలేమని భావించిన దర్శకుడు ధరణి, తమిళనాడులోని ఎలాంటి వసతులు లేనటువంటి ఓ మారుమూల గ్రామంలో చేపట్టగా, పవన్ ఉన్న విషయం తెలుసుకున్న జనాలు వేల సంఖ్యలో గ్రామాన్ని చుట్టుముట్టారని, పవన్ ను చూడడం కోసం బారులు తీరారని, దీంతో రెండు రోజుల పాటు అసలు పవన్ కళ్యాణ్ బయటకు వచ్చే పరిస్థితి లేదని, అలా అభిమానుల తాకిడికి ‘బంగారం’ సినిమా షూటింగ్ పలుమార్లు కాన్సిల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయని తన అనుభూతులను పంచుకుంది.
దక్షిణాది చిత్ర పరిశ్రమలో సినీ హీరోలను దేవుళ్ళుగా కొలుస్తారని తెలుసు గానీ, పవన్ కళ్యాణ్ ద్వారా తానూ ప్రత్యక్ష అనుభవాన్ని చవిచూసానని, క్రేజ్ అంటే ఏంటో తెలిసి వచ్చిందని మీరా చోప్రా చెప్పిన సంగతులు పవర్ స్టార్ ఫ్యాన్స్ లో నూతన ఉత్సాహాన్ని పంచుతున్నాయి.
Goodachari 2 is one of those Telugu films that has built strong expectations without relying…
Amiksha Pawar is setting the internet ablaze with her latest sartorial statement, redefining modern ethnic…