
అలా జరుగుతున్న మార్పులు పైసాచికత్వానికి దారి తీస్తున్నాయని యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానగణం నిరూపిస్తోంది. తమ అభిమాన హీరో సినిమా హిట్టు కావాలని ఓ ధియేటర్ వద్ద మేకను బలివ్వడం ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. మేకను నరికిన విధానం,ఆ తర్వాత అభిమానులు చిందులు వేసిన విధానాన్ని రికార్డు చేసి యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేసారు.
ఇక్కడ, ఏ హీరో అభిమానులన్నది కాసేపు పక్కన పెడితే, అసలు ఇలాంటి ఆలోచనలను అరికట్టాలి. ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులే చేసి ఉండవచ్చు, దీనిని స్పూర్తిగా తీసుకుని రేపు మరో అభిమాన వర్గం ఒకటికి, రెండు మేకలను బలి చేస్తే, ఆ కత్తి వేటుకు బలయ్యేది ఆ మూగ జీవాలు మాత్రమేనని మరువకూడదు. అయినా ఒక జీవం ప్రాణం తీసే అధికారం ఎరవిచ్చారు?
ఇక, అంత హంగామా చేసి, ఒక జీవాన్ని బలిచ్చారు కదా… ఆ సినిమా ఫలితం ఏమైంది? మళ్ళీ తుస్సుమంది. తొలిరోజు అదరగొట్టిన వసూళ్ళు రెండవ రోజు నుండి భారీ పతనాన్ని చూసాయి. ఓవర్సీస్ మినహాయిస్తే, రెండు తెలుగు రాష్ట్రాలలో రోజుకు రోజుకు సినిమా పరిస్థితి దయనీయంగా మారుతోంది. మరి బలిచ్చిన ఫలితం వచ్చిందా? అంటే అభిమాన వర్గం నేరెళ్ళబెట్టాల్సిందే!
ఒకవేళ బలిస్తేనే సినిమా విజయవంతం అవుతుందని నమ్మితే, “సింహాద్రి” విషయంలో ఎన్ని మేకపోతులు బలిచ్చారు? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. సినిమాలో విషయం ఉంటే ప్రేక్షకులతో సహా ఎవ్వరూ బలివ్వాల్సిన అవసరం ఉండదు. లేదు అంటే… మేకతో మొదలైన బలి ధియేటర్ కు వెళ్ళిన ప్రేక్షకుల వరకు కొనసాగుతుందని గుర్తుపెట్టుకోవాలి.
Allari Naresh is back to entertaining audiences with his latest fantasy comedy, Ramba Oorvasi Menaka.…
Some political timelines are just numbers. This one carries a lot more weight. Tamil Nadu…